Image result for కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై ఐటీ దాడులువరదాయపాళెం: కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఏకం గోల్డెన్‌ సిటీ (కల్కి భగవాన్‌ ఆశ్రమం)లో ఈ సోదాలు నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆ ఆశ్రమానికి సంబంధించిన కార్యాలయాల్లో ఏకకాలంలో మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఏకం గోల్డెన్‌ సిటీ వ్యవస్థాపకుడు భగవాన్‌ కుమారుడు కృష్ణాజీతో పాటు ఆ ట్రస్ట్‌ సీఈవో లోకేశ్‌ దాసోజీని ఐటీ అధికారులు వేర్వేరుగా విచారిస్తున్నారు.

కల్కి ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మికపరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్మును భూములు కొనుగోలు, డిపాజిట్లు చేయడం వంటి వాటిపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ ట్రస్ట్‌కు సంబంధించిన ఆస్తులు, ఆదాయ వ్యయాలతో పాటు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయా కార్యాలయాల్లోని ఫోన్‌లను స్వాధీనం చేసుకొని ఎవరినీ లోపలికి అనుమతించకుండా సోదాలు కొనసాగిస్తున్నారు. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.

(Courtesy Eenadu)