బెంగళూరు, జనవరి : కన్నడ, తెలుగు సినిమాల్లో కథానాయిక రష్మికా మందణ్ణ నివాసంపై ఐటీ అధికారులు దాడి చేశా రు. కర్ణాటక కొడుగు జిల్లా విరాజపేటలోని ఆమె ఇంటితోపాటు ఆ కుటుంబానికి చెందిన సెరెనిటీ మ్యారేజ్‌ హాల్‌, కాఫీ ఎస్టేట్‌లోనూ గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఉదయాన్నే 7.30 గంటలకు 3 ప్రైవేటు ట్యాక్సీల్లో ఆమె ఇంటికి చేరుకున్న 10 మంది అధికారులు రష్మిక అభిమానుల మంటూ లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న రష్మిక వెంటనే బెంగళూరుకు బయలుదేరారు.