– జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌…
– 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలోనే…
– రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ : సీఎం కేసీఆర్‌

అంతర్రాష్ట ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని రాష్ట్రప్రభుత్వం ఎత్తివేసింది. జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందనీ. కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30వ తేదీ వరకూ పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపధ్యంలో ఆదివారం ప్రగతిభవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. కంటైన్మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలుచేయాలని నిర్ణయించారు. కంటైన్మెంట్‌జోన్లలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు. దుకాణాలను రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలని అన్నారు.

Courtesy Nava Telangana