రచన బి. భాస్కర్

స్వర్గంలో మార్క్స్- అంబేద్కర్ నేటి యుగ నినాదం “లాల్ నీల్” 

స్వర్గంలో మార్క్స్- అంబేద్కర్ చర్చలు

లోక్ సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ లు భారతదేశ చరిత్రలోనే ఘోర ఫలితాల్ని చవిచూసిన నేపధ్యంలో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించేందుకు స్వర్గంలో మార్క్స్, అంబేద్కర్ లు సమావేశం అయ్యారు.

” ఏమిటి కామ్రేడ్ ముఖ్యమైన విషయాన్ని చర్చించాలని పిలిచావు. ఏదో  ఆలోచనలో  పడ్డావు” మార్క్స్ ను అడిగారు అంబేద్కర్.

” ఏమిటిది బాబాసాహెబ్ మనం చెప్పింది ఏమిటి, రాసింది ఏమిటి, ఆచరించింది ఏమిటి…. మన అనయా యు లు గా చెప్పుకుంటున్న వాళ్లు నేడు చేస్తున్నదేమిటి?మార్క్స్ స్వరంలో ఆవేదన.

‘మనం ఇరువురము చెప్పింది దాదాపు ఒకటే కదా.  ఒకర్నొకరు పూరించే లా ఉంటాయి మన రచనలు.ఇప్పుడు ఏమిటి మన అనుయాయుల మధ్య ఐకమత్యానికి బదులు విద్వేషం పరాకాష్టకు చేరుకుంటున్న ది. నాకు చాలా బాధగా ఉంది అంబేద్కర్’ మార్క్స్ కంటతడి పెట్టారు

ప్రపంచ విప్లవాల స్ఫూర్తి ప్రదాత విషన్న వదనాన్ని చూసి అంబేద్కర చలించిపోయారు

కామ్రేడ్, నాకు చాలా ఆందోళనగానూ దుఃఖం గాను ఉన్నది. సెమిఫాసిస్టు వాతావరణాన్ని చూస్తూ కూడా నేడు మన వారికి మిత్రులె వారో, శత్రువులెవరో తెలియటం లేదు. కలిసి పనిచేయాల్సిన వాళ్ళ మధ్య విద్వేషాన్ని పెంచే శక్తులు పేట్రేగిపోతున్నాయి. అయినా మన వారు చదివిన చదువంతా ఏమైనట్లు. త్రిపురనేని గోపీచంద్ ఎగతాళి చేసినట్లు” సజ్జలు” కథలా  ఉంది వ్యవహారం. సరే మన ముందు ఇప్పుడు ముఖ్యమైన కర్తవ్యం వచ్చి పడింది. మనం రాసింది ఏమిటో ఆచరించింది ఏమిటో ఎక్కడ వైరుధ్యాలు ఉన్నాయో కలుపుకుపోయే అంశాలు ఉన్నాయో స్వయంగా మనమే విశదీకరిద్దం. మనము క మాట అనుకొని ఫేస్బుక్లైవ్ పెడదాం. అప్పుడు అందరికీ మనమే స్వయంగా స్పష్టత ఇచ్చినట్లవుతుంది.

వర్గ దోపిడీ, పెట్టుబడిదారీ విధానం, పరాయీకరణ:

మార్క్స్: తొలుత పెట్టుబడిదారీ విధానం లో వర్గాలు, పరాయికరణ దీన్ని పోగొట్టడం ఎలా గా అన్న అంశాలపై చర్చిద్దాం. ప్రైవేటు ఆస్తి పెట్టుబడిదారుల గుప్పిటిలో చిక్కి, పెట్టుబడిదారీ విధానం ఏర్పడి అది మనిషి తనాన్ని పరాయీకరణకు గురిచేస్తుంది.  ఒక శాతం చేతిలో 99% సంపద పోగు పడటం ఇ న్దుకు పరాకాష్ట.

అంబెడ్కర్: భారీ పరిశ్రమలన్నీ రాజ్యం ఆధీనంలో ఉండాలని నేను చెప్పింది అందుకే కదా. పెట్టుబడిదారీ విధానం, వర్గ దోపిడీ గురించి మీరుచెప్పిన అంశాలతో నేను దాదాపు ఏకీభవిస్తున్నాను. నేను మొదట పెట్టింది కూడా కార్మిక పార్టీయే కదా.

మార్క్స్: నన్ను అర్థం చేసుకోవాలంటే నా తొలి రచనలతో మొదలుపెట్టి  ఇథినో గ్రాఫిక్ నోట్ బుక్స్, భారతదేశం పైన నా రచనలు అన్నీ చదవండి. కార్మికవర్గం ఐక్యమై పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప, అని ప్రధానంగా సూత్రీకరించాను అంటే దాని అర్థం దోపిడీకి గురవుతున్న వారందరూ సంఘటితం కమ్మని. వర్ణం కారణంగా దోపిడీకి గురయ్యే బ్లాక్స్, వందల సంవత్సరాలుగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అణచివేతకు గురవుతున్న దళిత బహుజనులు,మహిళలు కార్మిక వర్గం తో కలిసి సంఘటితం కావాలనేదే నా సందేశం. మీతో కలిసి పార్టీ పెట్టాలని ప్రయత్నించిన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా స్పష్టంగా చెప్పారు కదా భారతదేశంలో కులం అనేది ఘనీభవించిన వర్గమని. దీంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నా రచనలు, గ్రామ్ సి  రచనలు, స్వీకరించినట్లు అంబేద్కర్,ఫూలే భావాలను  కలిపి  రంగ రించి నప్పుడే భారతదేశంలో మనం కలలు గన్న సామ్యవాద, సామాజిక న్యాయ సమాజం ఏర్పడుతుంది.

అంబెడ్కర్: నేను జీవించి ఉన్నంతకాలం భారత కమ్యూనిస్టు లు నాతో కలిసి పని చేసేందుకు ఏనాడు ముందుకు రాలేదు. నా మనవడు ఆనంద్ టెల్ తుం డే అన్నట్లు నేటి సెమీ ఫాసిస్టు హిందుత్వ మత విద్వేష శక్తులను అడ్డుకునేందుకు లాల్- నిల్ కలవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. కానీ వీరిద్దరినీ కలవనీయకుండా చేసేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతు నాయి. రెండు వర్గాల వారు దీన్ని అర్థం చేసుకోలేకపోవటం దౌర్భాగ్యకరమైన అంశం. నా మనుమడు ప్రకాష్ అంబేద్కర్, ఎంఐఎం అసదుద్దీన్ ఒవైసీ తో కలసి లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో చేసిన ప్రయోగాన్ని చూసైనా లాల్ ,నిల్ శక్తులు నేర్చుకుంటాయే మో చూద్దాం. కాదు కాదు నేర్చుకుని తీరాలి.

అంబెడ్కర్: నేను గతాన్ని తవ్వుతూ కూర్చోలేదు. అందువల్లనే సోషలిస్టులూ, కమ్యూనిస్టులు, అంబేద్కర్ లిస్టు లు కలసి పనిచేయాలని, మీరు దళితులకు కాదు దేశానికే నాయకులని డాక్టర్ లోహియా అన్నప్పుడు నేను సంతోషంగా అంగీకరించాను. కానీఏం చేస్తాం  విధి వ క్రి oచింది !బహుశా ఈ పని  తర్వాతనైనా, కనీసం కొన్ని దశాబ్దాల క్రితం అయినా ప్రారంభించి ఉండాల్సింది. నేడు సీతారామ్ ఏచూరి లాల్, నీల్ పిలుపునిచ్చారు. తెలంగాణలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరిట ఒక ప్రయోగం జరిగింది. ఓట్లు రాలేదని దీన్ని తర్వాత పక్కన పెట్టారు. కొత్త ప్రయోగం విజయవంతం కావటానికి సుదీర్ఘ కసరత్తు, కార్యకర్తలకు బోధన, తగిన రాజకీయ విజయాలు వచ్చేవరకు కిందిస్థాయి కార్యాచరణ వంటివెన్నో అవసరమవుతాయి. దీన్ని గమనంలోకి పెట్టుకోకుండా అసలు బిఎల్ఎఫ్ నే పక్కన పెడితే ఎలా?

మార్క్స్: అవునవును. లోహియా తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేనైనా మీరైనా ఏ సిద్ధాంతకర్త సూత్రీకరణలు అయినా దాని స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి. కాలానుగుణంగా సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుండ లి. అంతేగాని సిద్ధాంతాన్ని ఘనీభవింపచేయకూడదు. ఇటువంటి దృష్టికోణంతో నా సిద్ధాంతాన్ని భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి ముందుకు తీసుకెళ్లండి. వర్గం పునాది అంశం కులం ఉపరితల అంశం వంటి విచిత్ర  వాదనలతో నే కదా కదా భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ముందుకు వెళ్లలేక పోయింది.

మార్క్స్,అంబెడ్కర్: జై భీమ్ కామ్రేడ్స్ ఇప్పటికైనా మేల్కొనండి. భారత కమ్యూనిస్టు పార్టీ పెట్టి వంద సంవత్సరాలు కావస్తున్నది. ఇప్పుడైనా ఆత్మ విమర్శ చేసుకోండి. నాయకత్వ స్థానాల్లో దళితులకు ఎందుకు అవకాశం కల్పించలేకపోతున్నారో  ఆత్మ విమర్శ చేసుకోండి. దళితుల్లో పొలిట్బ్యూరో సభ్యులు కాగలిగిన స్థాయి వారు లేదన్నా విచిత్ర వాదనల్ని పక్కన పెట్టండి. ఇప్పటివరకు అగ్రవర్ణ నాయకులైన మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలిగారా లేదా వెనక్కి తోసేశారా అన్న ఆత్మవిమర్శ చేసుకోండి. ఉదాహరణకు ప్రస్తుతం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పార్లమెంటు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఎంత ఉన్నదో గుర్తుకు తెచ్చుకోండి. ఎప్పుడయినా సరే భిన్నత్వం పని ప్రదేశాన్ని సుసంపన్నం చేస్తుంది. కొత్త ఆలోచనలకు వేదిక అవుతుంది. ఎస్సీ ఎస్టీలు లేని పొలిట్బ్యూరో ల ఆలోచనల్లో అవటి తనానికి కారణం భిన్నత్వం లేమియే.(ఇటివలే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులవటం సంతోషకరం. అయితే కులం – వర్గం అంశంపై, భారతదేశానికి కమ్యూనిజాన్ని అన్వయించటంపై డి.రాజా పార్టీలో కొత్త ఆలోచన ఏమి ప్రతిపాదించినట్లు కానరావటం లేదు) దళిత బహుజన సోదరి సోదరీమణులారా ఇక విమర్శలు దూషణలు చాలు. కామ్రేడ్స్ తమను తాము మార్చుకునేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి. భారతదేశానికి ముంచుకొచ్చినా పెను ముప్పును గుర్తించండి.  జై భీమ్ కామ్రేడ్స్. ఇదే మా ఇరువురి సందేశం.

(రచయిత సీనియర్ జర్నలిస్టు.)