న్యూఢిల్లీ : కరోనా లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సొంత ప్రాంతాలకు తరలి వెళ్లిన వలస కూలీలను మళ్లీ వెనక్కిరప్పించడం కోసం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఉచితంగా ట్రావెల్ టిక్కెట్లను అందివ్వడంతో పాటు ఇళ్ల సదుపాయాలను, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కార్మికులకు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైన వ్యాపారాలను నిర్వహించడానికి కూలీలు లేకపోవడంతో, కొన్ని కంపెనీలు, సమీప ప్రాంతాల్లో ఉన్న కొత్త వారిని నియమించుకుంటున్నాయి.

కార్మికులకు తిరిగి పని ప్రాంతాలకు వచ్చేందుకు ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఇతర ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్నామని లిన్ఫోక్స్ లాజిస్టిక్స్ ఇండియా కంట్రీ మేనేజర్ వీ.వీ వేణుగోపాల్ చెప్పారు. వలస కూలీలు రావడం ఆలస్యమవుతుండటంతో, తిరిగి పనులు ప్రారంభించేందుకు కొత్త వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా నియమించు కుంటున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా వర్కర్లకు బస్సులు, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్ సౌకర్యాలు కల్పిస్తు న్నామని తెలిపారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్ విధించగానే నగరాల్లో తినడానికి, ఉండటానికి కష్టమైన రోజువారీ కూలీలు పెద్ద ఎత్తున తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు. తరలి పోతోన్న వలస కూలీలను వెళ్లకుండా ఆపడంలో ప్రభుత్వాలు చాలా వరకు విఫలమయ్యాయి. చాలా మంది వందల కిలోమీటర్లు నడిచి సొంత ఊర్లకు చేరుకున్నారు.

ఇప్పుడు ఎకానమీ రీఓపెన్ అయిన తర్వాత, వారిని నగరాలకు రప్పించడానికి కంపెనీలు ప్రయత్ని స్తున్నాయి. కానీ నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో, వారు తిరిగి వచ్చేందుకు భయపడు తున్నారు. దీంతో లేబర్ కొరత ఏర్పడింది. కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో లేబర్ కొరత ఏర్పడిందని, ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆలస్యమవుతున్నట్టు కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన మహారాష్ట్ర యూనిట్ ప్రెసిడెంట్ రాజన్ బండేల్కర్ అన్నారు. విమానాల్లో అయినా వర్కర్లను వెనక్కి రప్పించడం కోసం తాము చూస్తున్నట్టు చెప్పారు. పలు ప్లాంట్లలో పనిచేసేందుకు 500 మంది వలస కార్మికులను నియమించుకున్నట్టు ఆసియాలోనే అతిపెద్ద ప్లేవుడ్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకటైన సౌతరన్ ప్లేవుడ్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ ఎంకే హన్ష చెప్పారు. తిరిగి వచ్చే కూలీలకు ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, ఇతర ప్రోత్సహకాలను ఆఫర్ చేస్తున్నానని తెలిపారు.

నిరుద్యోగం కట్టడి కోసం ప్రభుత్వ ప్రయత్నాలు..
ఇండియాలో నిరుద్యోగ రేటు జూన్ నెలలో 11 శాతంగా ఉంది. అంతకుముందు రెండు నెలలు ఈ రేటు 23 శాతం వద్ద రికార్డు స్థాయిలకు చేరినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటాలో వెల్లడైంది. అయితే పెరుగుతోన్న నిరుద్యోగ రేటును అదుపులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం జాబ్స్ ప్రొగ్రామ్‌‌ను స్పీడప్ చేసింది. ఎకానమీ రీఓపెన్ అయి కొంతమంది వర్కర్లు కూడా తమ ఉద్యోగాల్లో చేరారు. ప్రభుత్వం ప్రకటించిన రూరల్ జాబ్స్ ప్రొగ్రామ్ కింద వర్కర్లకు రోజుకు రూ.202 అందుతోంది.

Courtesy V6 Velugu