లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత రెండు నెలలుగా విమానాశ్రయాలకే పరిమితమైన విమానాలు మళ్లీ గగనయానం బాట పట్టాయి.

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత రెండు నెలలుగా విమానాశ్రయాలకే పరిమితమైన విమానాలు మళ్లీ గగనయానం బాట పట్టాయి. సుదీర్ఘ విమానం తర్వాత సోమవారం ఉదయం నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 4.20 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి పట్నాకు తొలి విమానం బయలుదేరింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కోల్‌కతాకు మరో విమానం ఉదయం 4.30 గంటలకు పయనమైంది. ఇక ఢిల్లీ విమానాశ్రయానికి 7:45 నిమిషాలకు మొదటి విమానం చేరుకుంది. ప్రయాణికులు అత్యధిక సంఖ్యలో విమానాశ్రయాలకు వస్తుండటంతో అధికారులు కరోనా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఫేస్ షీల్డ్‌తో పాటు మాస్కులను అందజేశారు.

అంతేకాకుండా ప్రయాణికులందరికీ ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించారు. మొదట టిక్కెట్లను తీసుకున్న వారిలో పారామిలటరీ సిబ్బంది, ఆర్మీ, విద్యార్థులు, ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే విమాన ప్రయాణికుల క్వారంటైన్‌పై గందరగోళం అలాగే కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఒక్కో రకంగా స్పందించడంతో ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము వెళ్తున్న రాష్ట్రాల్లోని క్వారంటైన్‌ నిబంధనలను ప్రయాణీకులు తెలుసుకోవాలని ఎయిర్‌ఏసియా ప్రకటించింది. క్వారంటైన్‌ సంబంధిత ఖర్చులతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. మొదట మహారాష్ట్ర సర్కార్ విమాన సర్వీసుల ప్రారంభాన్ని వ్యతిరేకించినా… ఆ తర్వాత 50 విమాన సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఏపీలో మాత్రం మంగళవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు.

విమానాశ్ర యాలకు వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ విభాగమే విమానాశ్రయాల సెక్యూరిటీ బాధ్యతలు పర్యవేక్షి స్తుండటం తెలిసిందే. ‘వందే భారత్‌’విమానాల రాకపోకల సందర్భంగా పలు విషయాలు గమనించిన విమానాశ్రయాల సెక్యూరిటీ విషయంలో పలు మార్పులు చేసింది. ప్రతి వ్యక్తి ఫోన్‌లో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ తప్పనిసరిగా వేసుకోవాలి. ఇకపై చెక్‌ఇన్‌ లగేజీగా ఒకటి మాత్రమే ఉండాలని, ప్రయాణికుడితో శానిటైజర్‌ బాటిల్‌కు అనుమతిస్తామని సీఐఎస్‌ఎఫ్‌ ప్రకటించింది.

ముంబై నుంచి 50 విమానాలు
మహారాష్ట్రలో కరోనా ఉధృతి అధికంగా ఉండడంతో ముంబై ఎయిర్‌పోర్టు నుంచి రోజు కు కేవలం 50 విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బగ్దో గ్రా ఎయిర్‌పోర్టుల్లో మే 28 నుంచి విమానాల సేవలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణానికి సిద్ధంగా విమానాలు