రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలను, హక్కుల పత్రాన్ని 1935 భారత రాజ్యాంగ చట్టం నుంచి తీసుకున్నారు. అమెరికన్, ఇంగ్లిష్, ఫ్రెంచి, రష్యన్ విప్లవాలు అందించిన భావాలను మనకు అనుగుణమైనరీతిలో తీసుకున్నారు. కానీ మన రాజ్యాంగం దేనికీ కాపీ కాదు. 395 అధికరణలు, 8 షెడ్యూల్స్‌తో ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పలు అధికరణలు, షెడ్యూల్స్ వచ్చిచేరాయి. డ్బ్భై ఏండ్లలో 100కు పైగా సవరణలు జరిగాయి.మతోన్మాదమనే భూతం దేశాన్ని ఆవరించింది. బాబ్రీ మసీదు విధ్వంసం, ఆ తర్వాత మత కలహాలు, 2002లో మత కలహాలు, మూకదాడులు రాజ్యాంగ లౌకికత్వానికి ప్రమాదకరంగా మారాయి. ఇటువంటి జరుగకూడదు. రాజ్యాంగం అంటే ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు మాత్రమే సంబంధించినది కాదు. ప్రజల్లో ప్రజాస్వామ్యస్ఫూర్తి ఉండాలె.

సామ్రాజ్యవాదం తోకముడిచే క్రమంలో ఆసియా, ఆఫ్రికాలోని పలు రాజ్యాలను ముక్కలుగా చేసింది. దీంతో ఈ దేశాల ముందు రెండు ప్రక్రియలు నిలిచాయి. ఒకటి స్వాతంత్య్రం పొందడం, రెండవది సరిహద్దులు గీసుకోవడం. భారత్, పాకిస్థాన్‌గా రెండు దేశాలేర్పడ్డాయి. సున్నీలకు, ముస్లింలకు నాయకత్వం వహించిన మహమ్మద్ అలీ జిన్నా (షియా), కాంగ్రెస్ పార్టీలో ప్రాబల్యం కలిగి ఉన్న నెహ్రూ, చివరి వైస్‌రాయ్ మౌంట్‌బాటె న్-దేశ విభజనకు కారణమెవరు? ఈ విషయమై చరిత్రకారులు, రాజకీయ నాయకులు విభేదిస్తుంటారు. భారత రాజ్యాంగాన్ని రచించుకున్న నేపథ్యం ఇది. ఈ రాజ్యాంగ రచన ఒక దేశం కోసమే కాదు, ఒక కొత్త నాగరికత కోసం.

1951లో దేశ జనాభా 36 కోట్లు. అయినా అద్భుతమైన వైవిధ్యం! యూరప్, రష్యా, ఆఫ్రికా, అమెరికాలలోని భావ, సంప్రదాయాల భిన్నత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటే, భారత్ ఎదుర్కొన్న సవాలు అంతక న్నా పెద్దది, బహువిధమైంది. రాజ్యాంగ రచయితల భుజస్కందాలపై భారీ బాధ్యత నెలకొన్నది. వారి చర్చలు, వాదనల స్థాయి సాటిలేని ది. 1949 నవంబర్ నాటికి రాజ్యాంగం సిద్ధమైంది. 1950 జనవరి 26న అమల్లోకి రావడంతో కొత్త గణతంత్ర ప్రయాణం మొదలైంది.
భారత రాజ్యాంగం ఒక అద్భుతం. మళ్లా అటువంటి రాజ్యాంగాన్ని రచించుకోవడం ఇప్పుడు చేపట్టినా సాధ్యం కాదు. 1956లో పాకిస్థాన్ రాజ్యాంగాన్ని ఆవిష్కరించుకున్నది. కానీ 1958లో సైనికపాలన పాలైం ది. మిగతా దేశాల రాజ్యాంగాలకూ ఇదేగతి పట్టింది. శ్రీలంక రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. బర్మాకు అదే పరిస్థితి ఎదురైంది. అందుకే భారత రాజ్యాంగం దేశానికి మూలరాయి అన్నారు. అంబేద్కర్ సారథి గా రూపకల్పన జరిగిన ఈ రాజ్యాంగానికి బలం-స్వేచ్ఛగా చర్చించుకోవడం, సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు జరుపుకోవడం, రాజీకి సిద్ధపడటం.

రాజ్యాంగరచనలో చురుగ్గా పాల్గొన్నవారు అనేకమంది. అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, కె.ఎం.మున్షీ, సర్దార్ పటేల్ మొదలైన ఉద్ధండులున్నా రు. పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ హేతుబద్ధత అనే భావనను ప్రతిపాదించారు. మహిళావాద దృక్పథంతో సంఘ సంస్కరణను అమృతాకౌ ర్, హంసా మెహతా ప్రతిపాదించగా కె.టి.షా మద్దతిచ్చారు. నెహ్రూ దేశాన్ని నడుపడంలో నిమగ్నమై ఉన్నా వీలైనప్పుడల్లా రాజ్యాంగసభకు హాజరయ్యారు. ఛాందసవాదులు బలమైన కేంద్రం, శాంతిభద్రతలను కాపాడటానికి పీడీ చట్టం, ఎమర్జెన్సీ అధికారాలుండాలన్నారు. ఉదార వాదులు వాక్‌స్వాతంత్య్రం, సమానత్వం, హక్కుల పత్రం ఉండాలన్నా రు. సంస్కరణవాదులు జమీందార్లను నిర్వీర్యం చేయడానికి భూసంస్కరణలు జరుగాలని సూచించారు. మతాలు సంఘ సంస్కరణలకు లోబడి ఉండాలన్నారు.

రాజ్యాంగ ప్రాథమిక లక్షణాలను, హక్కుల పత్రాన్ని 1935 భారత రాజ్యాంగ చట్టం నుంచి తీసుకున్నారు. అమెరికన్, ఇంగ్లిష్, ఫ్రెంచి, రష్యన్ విప్లవాలు అందించిన భావాలను మనకు అనుగుణమైనరీతిలో తీసుకున్నారు. కానీ మన రాజ్యాంగం దేనికీ కాపీ కాదు. 395 అధికరణలు, 8 షెడ్యూల్స్‌తో ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పలు అధికరణలు, షెడ్యూల్స్ వచ్చిచేరాయి. డ్బ్భై ఏండ్లలో 100కు పైగా సవరణలు జరిగాయి.
రాజ్యాంగం అనేక అంశాల మేళవింపు. బలమైన కేంద్రం, రాష్ర్టాల తో సమాఖ్య స్వరూపం ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కుల గుర్తింపు, ఆదేశిక సూత్రాలతో పాటు దిక్సూచి మాదిరిగా రాజ్యాంగపీఠిక ఏర్పరిచారు. రాష్ర్టాల సరిహద్దులను మార్చడం, కొత్త వాటిని ఏర్పాటుచేసే అధికారం ఉండటం కేంద్రానికి ఉండటం తీవ్రమైనదే అయినప్పటికీ, భాషాపరమైన ఇతర వైవిధ్యాలను కాపాడటం కోసం ఇది ఏర్పాటైంది.

రాజ్యాంగాన్ని మరో కోణంలో కూడా చూడవచ్చు. ఎన్నికలు, పార్లమెంటరీ నియంత్రణతో కూడిన రాజకీయ ప్రజాస్వామిక నిబంధనలను పొందుపరిచారు. చట్టబద్ధపాలన, న్యాయపాలనకు సంబంధించినవి న్యాయవ్యవస్థకు జతపరిచారు. ప్రత్యేకించి హైకోర్టు, సుప్రీంకోర్టుకు దాఖలు పరిచారు. న్యాయపరమైన నిబంధనలు లేకపోతే నిరంకుశత్వం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్యసూత్రాలు లేకపోతే ప్రజల హక్కులను న్యాయమూర్తులు కబళిస్తారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి పార్లమెంటు, న్యాయవ్యవస్థ మధ్య వైషమ్యం మూలంగా ఇరుపక్షాల నిబంధనల మధ్య ఘర్షణ కనిపిస్తుంది.

స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి 1964లో మరణించేవరకు, అత్యం త ప్రమాదకరమైన దశాబ్దాల్లో రాజ్యాంగస్ఫూర్తిని కాపాడిన ఘనత నెహ్రూకు దక్కుతుంది. 1947లో ప్రధాని అయ్యేనాటికి ఆయనకు అరు వై ఏండ్లు. అంతకుముందు బ్రిటిష్ హయాంలో పదేండ్ల పాటు జైలు జీవితం గడిపారు. 1959లో కేరళలో ఎమర్జెన్సీ విధించినప్పటికీ, ఆయ న ప్రజాస్వామ్యవ్యవస్థలో నమ్మకం ఉన్న నిబద్ధత గల పార్లమెంటేరియ న్. న్యాయవ్యవస్థ వల్ల ఇబ్బందులుంటాయనే అనుమానాలున్నప్పటికీ, ఆయన ఏనాడూ న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. జమీందారీ వ్యవస్థను రద్దుచేయడానికి, రాష్ర్టాలను భాషా ప్రాతిపదికన పునర్నిర్మించడానికి రాజ్యాంగసవరణపై ఆధారపడ్డారు. ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారు. అలీన విధానంతో 3వ ప్రపంచ దేశాల ఐక్యతను చాటారు. సభా ధిక్కారం, కోర్టు ధిక్కారం అంటూ పిలిపించినప్పుడు వినమ్రంగా వ్యవహరించారు. నెహ్రూ ఆయన సహచరులు అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డారు.

రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య స్ఫూర్తిదాతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. ఆయన లేకపోతే భారత రాజ్య్యాంగం సంక్షోభంలో పడి విఫలమయ్యేది. ఆయన పాత్రను భవిష్యత్ చరిత్ర గుర్తించాలె.
ఇందిరాగాంధీ నెహ్రూకు భిన్నంగా వ్యవహరించారు. 1967-77 కాలంలో శత్రువులను ఎదుర్కొనడానికి అనేక కుయుక్తులు పన్నారు. తనను కాపాడుకోవడానికి, ఎన్నికలు ఎత్తివేయడానికి, రాజకీయ నాయకులను విచారణ లేకుండా నిర్బంధించడానికి వాక్ స్వాతంత్య్రాన్ని తొక్కివేయడానికి ఎమర్జెన్సీని (1975-77) కూడా విధించారు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మలుచుకోవచ్చునని, ఇందుకోసం ఎంతవరకైనా వెళ్ళవచ్చునని ఆమె సలహాదారులు భావించారు. పదవిని కాపాడుకోవడానికి రాజ్యాంగం ఒక రాజకీయ ఆటకాయగా మారింది. సుప్రీంకోర్టు మాత్రమే ఆమెకు ఎదురునిలిచింది. ఎమర్జెన్సీలో న్యాయవ్యవస్థను కూడా బలహీనపరిచారు. ఆమెను వ్యతిరేకించినవారిని నిర్బంధించడం సాగింది. సామ్యవాద ఆశయాలను నెరవేర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి (గరీబీ హటావో) ఇదంతా చేస్తున్నట్టు ఆమె చెప్పుకున్నారు. రాజ్యాంగ విలువలను గౌరవించని ఒక పెద్ద నాయకురాలిగా ఆమె వేసిన జాడ కొనసాగుతున్నది. ఆమె నెలకొల్పిన కుటుంబ పాలన-రాజీవ్, సోనియా, రాహుల్ ద్వారా ఇంకా పార్టీలో కొనసాగుతున్నది. ప్రజాస్వామ్య మార్గంలోనైనా సరే, వారసత్వ పాలనను ప్రజాస్వామ్య రాజ్యాంగం ఆమోదించదు.

న్యాయానికి, చట్టబద్ధ పాలనకు, రాజ్యాంగానికి న్యాయవ్యవస్థ పరిరక్షకురాలు. ఎమర్జెన్సీలో క్షమించరాని తప్పిదాన్ని మినహాయిస్తే న్యాయవ్యవస్థ ఒక ధ్రువంగా నిలిచింది. న్యాయవ్యవస్థనే లేకపోతే భారత రాజ్యాంగం ఎన్నికైన నిరంకుశంగా మారిపోయేది. న్యాయవ్యవస్థను ప్రత్యేకించి సుప్రీంకోర్టును మొదట్లో సామాజిక న్యాయానికి వ్యతిరేకిగా చిత్రీకరించారు. కానీ సుప్రీంకోర్టు ఎదురు పోరాటం జరిపి ప్రజలు తమ తలుపుతట్టేలా చేసుకున్నది. ప్రజా ప్రయోజన చట్టాన్ని సృష్టించింది. ఈ విధంగా పర్యావరణం, సామాజిక న్యాయం, అవినీతి వ్యతిరేకత వంటి అంశాలను చేపట్టింది. న్యాయవ్యవస్థ పరిపాలన, విధానపరమైన అంశాల్లోకి చొచ్చుకువస్తున్నదనే విమర్శలున్నాయి. ఇందుకు బదులుగా కుప్పలుగా ఉన్న కేసులను పరిష్కరించాలనే సూచనలు వచ్చాయి. ప్రభుత్వం పై పరిపాలనాపరమైన అవినీతి నీడలు పరుచుకున్నప్పుడు మాత్రమే సమతుల్యం సాధించడానికి తాము జోక్యం చేసుకుంటున్నామని న్యాయవ్యవస్థ అంటున్నది. అయితే న్యాయవ్యవస్థ సమతుల్యతను దాటేసి, శాసన, కార్యనిర్వాహక శాఖల అధికారాల్లోకి చొచ్చుకుపోవడం కూడా జరిగింది. ప్రజలతో సంబంధాలను నెలకొల్పుకున్నది. న్యాయమూర్తుల నియామకంపై మాత్రం ఘర్షణ సాగుతున్నది.
కార్యనిర్వాహకశాఖ నియమాలు చేపట్టడం వల్ల రాజకీయమయమైన న్యాయమూర్తులు వచ్చారు. దీంతో న్యాయవ్యవస్థనే నియామకాలు చేపట్టింది. దీన్ని కార్యనిర్వాహకశాఖ అడ్డుకుంటున్నది. స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉండాలంటే స్వతంత్ర నియామకాలుండాలె. బలమైన న్యాయవ్యవస్థ లేకపోతే రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలుతుంది.

మతోన్మాదమనే భూతం దేశాన్ని ఆవరించింది. బాబ్రీ మసీదు విధ్వంసం, ఆ తర్వాత మత కలహాలు, 2002లో మతకలహాలు, మూకదాడులు రాజ్యాంగ లౌకికత్వానికి ప్రమాదకరంగా మారాయి. ఇటువం టి జరుగకూడదు. రాజ్యాంగం అంటే ప్రభుత్వానికి, న్యాయస్థానాలకు మాత్రమే సంబంధించినది కాదు. ప్రజల్లో ప్రజాస్వామ్యస్ఫూర్తి ఉండా లె. ఎన్నికల తర్వాత ఎన్నికలు జరుగుతూ భారత ప్రజాస్వామ్య ప్రయా ణం నిర్మిరోధంగా సాగుతూనే ఉన్నది. ఎన్నో ప్రయాసల మధ్య ఈ ప్రజాస్వామ్యం అంటే భారతీయులకు ఒక మతవిశ్వాసం మాదిరిగా మారిం ది. ఈ అద్భుతం ఇంకా కొనసాగుతూనే ఉన్నది.
(వ్యాసకర్త: సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది)

Courtesy NamasteTelanagana..