బెంగళూరు : టిక్‌టాక్‌ యాప్‌కు బానిసైన ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లా మాగనహళ్లిలో జరిగింది. టిక్‌టాక్‌ ద్వారానే చివరి వీడియోను పోస్ట్‌ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మాగనహళ్లికి చెందిన నాగరాజు అలియాస్‌ రాజు(34) టిక్‌టాక్‌కు బానిసగా మారాడు. మొదటి భార్య వదిలివెళ్లిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. టిక్‌టాక్‌లోనే ఉండడంతో రెండో భార్య కూడా వదిలేసి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసగా మారిన రాజు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు టిక్‌టాక్‌లో పోస్టింగ్‌ పెట్టి ఉరివేసుకున్నాడు.

Courtesy Andhrajyothi