ముంబయి : హేతువాది నరేంద్ర దబోల్కర్‌, సామాజిక కార్యకర్త గోవింద్‌ పన్సారేల హత్య కేసుల్లో దర్యాప్తు ఆలస్యం కావడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హత్య కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ, సీఐడీ వంటి సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయం అందించడంలో ‘వైఫల్యం’ ఉండకూడదని న్యాయస్థానం సూచించింది. దబోల్కర్‌ కేసును సీబీఐ, పన్సారే కేసును సీఐడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కోరుతూ దబోల్కర్‌, పన్సారే కుటుంబాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై న్యాయమూర్తులు ఎస్‌.సి ధర్మాధికారి, ఆర్‌.ఐ చాగ్లాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపి పై విధంగా స్పందించింది. 2015లో పన్సారే, 2013లో దబోల్కర్‌లను దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana