సతారా: ఆ దొంగలకు కొత్త ఆలోచన తట్టింది. అందరూ కరోనా సోకకుండా ఉండేందుకు వాడే పిపిఇ కిట్లను దోపిడీకి ఉపయోగించాలని భావించారు. ఇలా ఐతే తమను ఎవరూ గుర్తు పట్టలేరని తెలివైన ఎత్తు వేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా పట్టణంలో జరిగింది.

దొంగలు చేతులకు గ్లౌవ్స్‌, ముఖాలకు మాస్క్‌లు, తలకు క్యాపులు, ఒళ్లంతా ప్లాస్టిక్‌ జాకెట్స్‌ వేసుకొని ఎవ్వరూ గుర్తు పట్టకుండా సతారాలోని ఓ బంగారు దుకాణంలోకి గోడను పగల కొట్టి ప్రవేశించారు. దుకాణంలో ఉన్న బంగారాన్నంతా దోచుకున్నారు. దాదాపు 750 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. ఆ తర్వాత సిసి టివి ఫుటేజ్‌ ద్వారా దొంగలు ఎలా వచ్చారనేది తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

Courtesy Prajasakti