Image result for పది పేజీలు చదివితే రూ.30 రాయితీ"పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్న క్షౌరశాల యజమాని

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ఓ క్షౌర దుకాణ యజమాని పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీని కోసం దుకాణంలో ఓ గ్రంథాలయమే ఏర్పాటు చేశారు. ఏదైనా పుస్తకంలో 10 పేజీలకు పైగా చదివితే తన వద్దకు వచ్చే వారికి రూ.30 రాయితీ కూడా ఇస్తున్నారు. ఈ క్షౌరశాల తూత్తుకుడి జిల్లా మిల్లాపురంలో ఉంది. సాధారణంగా క్షౌరశాలలో గది మొత్తం అద్దాలు, అలంకరణ వస్తువులతో కనిపిస్తుంది.  ఈ దుకాణంలో ప్రతి అరలో పుస్తకాలు కనిపిస్తాయి. చిన్నప్పటి నుంచి పుస్తకాలపై ఉన్న ఇష్టంతోనే ఈ తరహా ఆలోచన చేసినట్లు దాని యజమాని మారియప్పన్‌ తెలిపారు.

(Courtesy Eenadu)