ఢిల్లీ అల్లర్లపై తీవ్రంగా స్పందించిన జాతీయ పత్రికలు
ఖండిస్తూ సంపాదకీయాలు
కలాల కంటే రుద్రాక్ష మాలలు బెటర్‌ :

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో నాలుగు రోజులుగా జరుగుతున్న అల్లర్లలో భాగంగా మంగళవారం అతివాద హిందూత్వ మూకలు పాల్పడిన హింసపై జాతీయ ఆంగ్ల, హిందీ పత్రిలకలు తీవ్రంగా స్పందించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో రోజు పర్యటనకు సంబంధించిన కవరేజీ ఉన్నా.. రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు జరిగినా.. దానికి ప్రాధాన్యం తగ్గించి మరీ ఢిల్లీ అల్లర్లను హైలైట్‌ చేశాయి. ది టెలిగ్రాఫ్‌ అయితే.. ‘గుజరాత్‌ మోడల్‌ ఢిల్లీకి చేరింది’ అనే శీర్షికతో అల్లర్లకు సంబంధించిన వార్తతో పాటు ఆ ఘటనను కవర్‌ చేయడానికి వెళ్లిన పలువురు పాత్రికేయులపై మూకలు జరిపిన దాడిని వివరించింది. అంతేగాక పాత్రికేయులు తమ గుర్తింపును చూపించుకోవడానికి కలాలు, గుర్తింపు కార్డులకు బదులు రుద్రాక్షమాలలు తమ వెంబడి తీసుకెళ్లాలని ఓ వార్తను ప్రచురించింది. ఒక ముస్లిం వ్యక్తిపై మూకలు దాడి చేస్తున్న ఫోటోతో.. ఢిల్లీ పోలీసుల బలహీనతలను ‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఎత్తిచూపింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ది హిందూ, హిందూస్థాన్‌ టైమ్స్‌, ది స్టేట్స్‌మెన్‌లు..

చనిపోయినవారి సంఖ్యతో పాటు హింస జరిగిన క్రమాన్నీ వివరించాయి. ‘ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు’ అనే శీర్షికతో హిందీ పత్రిక దైనిక్‌ జాగరణ్‌… ’50 గంటల హింసలో 13 మంది మృతి’ అని నవభారత్‌ టైమ్స్‌ ప్రచురించింది. ‘ఢిల్లీలో ఒక నెల పాటు 144 సెక్షన్‌’ అని మహారాష్ట్ర నుంచి వెలువడే శివసేన పత్రిక సామ్నా రాసింది.

ఇక ఢిల్లీ అల్లర్లపై పోలీసుల వ్యవV ారించిన తీరుపై దాదాపు అన్ని పత్రి కల సంపాదకీయాలు ఖండించాయి. అల్లర్ల కారణం గా అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఢిల్లీ హింస : పాలన యొక్క పరీక్ష’ అనే పేరుతో ది హిందూ రాసిన సంపాదకీయంలో ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా ఈ అల్లర్లకు సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశరాజధాని పోలీసుల తీరును, కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ స్పందననూ ఖండించింది. ఢిల్లీకి బలమైన పోలీసు బాసు కావాలని ‘హిందూస్థాన్‌ టైమ్స్‌’… ఈ అల్లర్లతో భారత ప్రతిష్ట దెబ్బతింటుందని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేశాయి.

Courtesy Nava telangana