• ఒక సామాన్య మంగలి కుటుంబం లో పుట్టిన బిడ్డ….!!
  • ఇప్పుడు ఐరాస ప్రచారకర్తగా…!

తమిళనాడులోని మధురైకి చెందిన బార్బర్ నేత్రా మోహన్ దాస్(13)కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యుఎన్ఏడిఏపీ ఆమెను గుడ్ విల్ అంబాసిడర్‌గా ప్రకటించింది. గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎంపికైన ఆమెకు ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించే అవకాశం లభిస్తుంది.
దేశ విదేశాల నాయకులు, విద్యావేత్తలు, రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు పేదలకు సాయం చేసే దిశగా పురికొల్పేందుకు ఆమె ప్రసంగం తోడ్పాటు అందించనుంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఈ అవకాశం వచ్చింది.

నేత్ర తండ్రి మోహన్ మధురైలో ఓ బార్బర్ షాపు నిర్వాహకుడు.
ఎంతో కష్టపడి మోహన్ తన కుమార్తె సివిల్స్ చదువు కోసం రూ.5లక్షలను కూడబెట్టుకున్నాడు. అయితే, కరోనా వైరస్ కారణంగా ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న పేదలను చూసి నేత్ర చలించిపోయింది.
తన సివిల్స్ చదువు కోసం కూడబెట్టిన రూ.5లక్షలను పేదలకు సాయం చేయడానికి వెచ్చించాలని తండ్రిని కోరింది. ఈ విషయం తెలుసుకుని అందరూ ఆమెను అభినందించారు. పీఎం మోదీ కూడా మన్ కీ బాత్‌లో నేత్రా గురించి ప్రస్తావించారు. అలాగే నేత్ర త్యాగాన్ని గుర్తించిన డిక్సన్ స్కాలర్‌షిప్ సంస్థ ఆమెకు రూ.లక్ష స్కాలర్‌షిప్ ప్రకటించింది.
నా భారత దేశంలో పుట్టినందుకు పాదాభివందనం చిట్టితల్లి….🙏🙏