– నినాదాలు చేస్తూ హిందూ సేన ర్యాలీ

గురుగ్రాం : ఓ పక్క రాజధాని నగరం అట్టుడుకుతూనే ఉన్నది. మరోపక్క ‘గోలీ మారో’ నినాదాలతో హిందూత్వ శక్తులు రెచ్చిపోతూనే ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రాంలో హిందూసేన కార్యకర్తలు రెచ్చగొట్టే నినాదాలతో వీధుల్లో హల్‌చల్‌ చేశారు. ‘దేశ ద్రోహులను కాల్చిపారేయాలి’ అంటూ నినాదాలుచేస్తూ దాదాపు 60 మంది కార్యకర్తలు సివిల్‌ లైన్స్‌, గురుద్వార్‌ రోడ్‌, సర్దార్‌ బజార్లలో ర్యాలీ జరిపారు. కాగా, పోలీసులు ఇక్కడ కూడా ప్రేక్షకపాత్రే వహించారు. నినాదాలు చేస్తున్న ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. పోలీసు డిప్యుటీ కమిషనర్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళిన హిందూసేన సభ్యులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. యూపీలోలాగా అల్లర్లకు పాల్పడినవారికి భారీ జరిమానా విధేంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

Courtesy Nava Telangana