– ఇటీవల సర్కారీ మీడియాను ‘గోడీ మీడియా’ అంటూ ఆంగ్ల పత్రికలు రాస్తున్నాయి. ఇది కానిది ‘గుడ్‌ మీడియా’ అట ! నిష్పాక్షికంగా వార్తలు ఇస్తామనే వారు సైతం ”రెండు వైపులా కథనాలు’, ‘కొట్లాట’, ‘రెండు వైపుల నుంచి జరిగిన హింస’, ‘నిరసన కారులు కూడా రాళ్లు రువ్వారు’ వంటి శీర్షికలు పెట్టారు.

 • ఈమధ్య ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి 23 నుంచి హింసాకాండ జరిగింది. దానికి కారణం బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా.. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారుల ముందే ఆయన అల్టీమేటం ! సీఏఏ వ్యతిరేక ప్రదర్శన నిరసకారులను మూడు రోజుల్లో పోలీసులు కనుక ఖాళీ చేయించకపోతే తామే ఖాళీ చేయిస్తామని అల్టీమేటం! కేంద్రం హౌం మంత్రి అమిత్‌ షా అధ్యర్యంలోని ఢిల్లీ పోలీసులు చప్పుడు చేయకుండా నిలబడ్డారు.

 • కపిల్‌ మిశ్రా ఉపన్యాసం తరువాత మారణకాండ ప్రారంభమైంది. ఈశాన్య ఢిల్లీ రణరంగమైంది. 42 మందికి పైగా హతమయ్యారు. ఘర్షణలు జరిగిన ప్రాంతాలు చూసినా, చనిపోయిన వారి పేర్లు చూసినా, ధ్వంసమైన ఆస్తులు ఎవరివన్నది చూసినా జరిగిన విషయం ఎవరికైనా స్పష్టం అవుతుంది.
  అపూర్వ దృశ్యాలు ఈ సందర్భంగా కండ్లబడేవేంటంటే గుళ్లను కాపాడిన ముస్లింలు.. ముస్లింలకు రక్షణ కల్పించిన హిందువులు. ఇరు మతాల ప్రజలు రోడ్ల పైకి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడం వంటివి. రాక్షసమూకోన్మాదంలో కూడా మానవత్వం వెల్లివిరిసిందనడానికి సాక్ష్యాలు.

 • ‘గోడీ మీడియా’ ముస్లింల దాడి వంటి రాతలు అదే పనిగా రాస్తున్నా నిష్పాక్షిక మీడియా (గుడ్‌ మీడియా) ఇరువైపుల దాడుల గురించి పేర్కొంటున్నది. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కోసం తమను తాము రక్షించుకునే హక్కును గురించి ఈ నిష్పక్షిక మీడియా మర్చిపోయింది. ఈ అంశానికి సంబంధించిన ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ అని చెప్పుకుంటూనే ”కొందరు ముస్లింలు శాంతియుతంగా తమను తాము చంపనీయకుండా, తమ ఇండ్లను దోచుకోనీయకుండా, తగలబెట్టనీయకుండా అడ్డుకుంటున్నారనీ కొందరు బాధపడుతు న్నారు’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

 • గత రెండు నెలలుగా శాంతియుతంగా రాజ్యాంగంపై ప్రమాణం చేసి మరీ మహిళలు ప్రారంభించిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌ వ్యతిరేక నిరసనలను భగం చేసేందుకు, దానిని దెబ్బ తీసేందుకే ఈ మారణకాండ జరిగిందనేది నిర్వివాదాంశం.

 • ఇరవై మూడు ఇరవై నాలుగేండ్ల ఫైజాన్‌ను వీపరీతంగా చితకబాది రక్తం కారుతున్న అతన్ని జాతీయ గీతం పాడాలనీ ఒత్తిడి చేయడం.. ఆ వీడియో ఆ కుటుంబాన్ని కలిచివేసింది. సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఆస్పత్రిలో సరైన వైద్యం సర్కారు అందించలేదు. దీంతో ఆయన ప్రాణాలు కొల్పోయారు.

 • మత ఉద్రిక్తల మధ్య గోడీ మీడియా పుణ్యమా అని మతోన్మాద విషం పోలీసులు, డాక్టర్లు సమాజంపైననే చిలకరించబడుతున్నది. ఈ పరిస్థితి బీజేపీ నిలుస్తున్నది. ఇలాంటి దశలో నిష్పాక్షిక రాజకీయ ప్రయోజనాల కోసం మీడియా వాస్తవాలను ధైర్యంగా ప్రజలకు తెలియజేయడంపై తన శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించాలి.
  రచయిత: ఆనంద్‌ మాంగ్వాలే
  దివైర్‌లో రాసిన కథనం.

Courtesy Nava Telangana