న్యూఢిల్లీ: ఈ ఘటన చూస్తుంటే కూటికోసం కోటి విద్యలు అనేసామేత గుర్తొస్తోంది. పొట్టకూటికోసం తను చేస్తున్న వృత్తినే నమ్ముకున్నాడు ఓ వ్యక్తి. కొన్ని ఏళ్లుగా ఒకే వృత్తిలో ఉన్నాడు. వివరల్లోకెళితే లక్మన్ అనే వ్యక్తి గేదె మాంసం తరలించే పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ట్రక్కులో ఢిల్లీ, బాద్షాపూర్‌ మీదుగా మాంసాన్ని తరలిస్తుండగా, ఈ విషయం తెలుసుకున్న గో గూండాలు అతడిని దాదాపు 8 కిలోమీటర్లు వెంబడించి చితకబాదారు. సుత్తెతో తలపై కొట్టారు. ఇష్టం వచ్చినట్లు ఏది దొరికితే దానితో కొట్టి, కాళ్ళతో తంతు లాక్కెల్లరు. ఈ ఘటనలో లక్ష్మన్కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక్కరు కూడా లక్ష్మన్ను కాపాడే ప్రయత్నం చెయ్యలేదు.

లక్ష్మన్ని వెంబడించి కొట్టే సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకునే లోపే లక్ష్మన్ను చితకబాదారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రక్కును పరిశీలించే పనిలో పడ్డారే తప్ప, దాడి చేస్తున్న వారిని ఆపాలనే ప్రయత్నం చేయ్యలేదు. ఇంతలో గో గుండాలు అక్కడినుండి పరారయ్యారు. పోలీసుల ప్రవర్తన గమనించిన స్థానికులు వారిపై మండిపడ్డారు. ఇక లక్ష్మన్ను ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులెవరో దాడి చేసి పరారయినట్లుగా కేసు నమోదు చేశారు. ట్రక్కు యజమానిని దీనిపై విచారించగా తాను 50ఏళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు మాత్రం ఈ ఘటనపై చెర్యలు చేప్పట్టి, నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు.