మండలంలో ఉన్న జింగిలి పాలెం గ్రామ ఎస్సీ కాలనీ వాసులు గత పది సంవత్సరాలుగా తమ భూములను సాగు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఇంతవరకు వారి భూములకు పట్టాలు ఇవ్వకపోవడం శోచనీయమని సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరి పుల్లయ్య అన్నారు. జంగిల్ పాలెం గ్రామ ఎస్సీ కాలనీలో నివసిస్తున్నా పేద రైతులు గత పది సంవత్సరాలుగా బ్లాక్ నెంబర్ 165 లో సబ్ డివిజన్ 465 నుండి 478 లో మొత్తం 125 ఎకరాల్లో చెరువు మనకు పోను మిగిలిన అరవై ఆరు ఎకరాల్లో జింగిల పాలెం ఎస్సీ కాలనీ రైతులు తమ భూముల్లో ప్రతి ఏటా సాగు చేసుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా సాగు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇక్కడ భూములకు రేట్లు పెరగడంతో కొంతమంది ఆక్రమణదారులు, అగ్రకుల పెత్తందార్లు ఈ పేదల భూముల మీద కన్ను వేసి ఎస్సీలను ఎలాగైనా భయపెట్టి భూములను తమ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారని ఇది ఎప్పటికీ జరగదని అంగేరి పుల్లయ్య తెలిపారు. అలాగే స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్సీలకు అండగా నిలిచి వారు సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇప్పించాలని కోరారు. జింగిల్ పాలెం ఎస్సీ లకు సిపిఎం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఎవరు భయపడాల్సిన పని లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం మణి, సిఐటియు డివిజన్ కార్యదర్శి పెనగడం గురవయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెడం గోపి, ఈశ్వరయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.