Image result for సబలల సాకారమెలా?"ఆత్మరక్షణ విద్యలో బాలికలకు తూతూమంత్రంగా శిక్షణ
సంస్థల ఎంపిక నుంచీ  నిబంధనల ఉల్లంఘనే

అమరావతి: పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న మార్షల్‌ ఆర్ట్స్‌, కరాటే శిక్షణ తూతూమంత్రంగా కొనసాగుతోంది. బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఏటా నిధులు కేటాయిస్తున్నాయి. శిక్షణ సంస్థల ఎంపిక నుంచి శిక్షణ వరకు నిబంధనల ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. 8, 9, 11, 12 తరగతుల విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) ఇటీవల ఆరు సంస్థలను ఎంపిక చేసింది. శిక్షణ బాధ్యతలను ఇవే సంస్థలకు సమగ్ర శిక్ష అభియాన్‌ అప్పగించేసింది.

ఇలా చేస్తున్నారు..
* ఆత్మరక్షణ విద్యలో శిక్షణనిచ్చేందుకు ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు క్షేత్రస్థాయిలో మరికొన్ని కరాటే అకాడమీలకు ఉపగుత్తకు బాధ్యతలను అప్పగించేశాయి. ఒక్కో శిక్షకుడికి 8 నుంచి 10 పాఠశాలలు కేటాయించడంతో వీరు గంటపాటు చెప్పాల్సిన శిక్షణను అరగంటలోనే ముగించేస్తున్నారు.

* ఈ ఏడాది కొత్తగా సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) శిక్షణ సంస్థలను ఎంపిక చేయాల్సి ఉంది. దీనికి భిన్నంగా ఆర్‌ఎంఎస్‌ఏ ఎంపిక చేసిన వారికే శిక్షణ బాధ్యతలను ఇచ్చేశారు. దీంతో సిబ్బంది లేక ఈ సంస్థలు ఎస్‌ఎస్‌ఏ శిక్షణను వాయిదా వేస్తున్నాయి.
* ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 8వ తరగతి వారికి శిక్షణనివ్వాలని ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ రెండు విభాగాలూ ఉత్తర్వులివ్వడంతో పాటు నిధులను కేటాయించాయి. మూడు నెలలపాటు నిర్వహించే శిక్షణలో ఒక్కో పాఠశాలలో 30 గంటల శిక్షణనివ్వాల్సి ఉంది. ఇది 20 గంటల్లోపే ఉంటోంది. నవంబరు 10 నుంచి శిక్షణ ప్రారంభించాలన్న ఎస్‌ఎస్‌ఏ ఉత్తర్వులు అమలవడం లేదు.
* శిక్షణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ రూపొందించిన మాడ్యూల్స్‌ ఆచరణలో కనిపించడం లేదు. శిక్షణనిచ్చేవారికి కరాటేలో బ్లాక్‌బెల్టు   ఉండాలనే నిబంధన అమలు కావడం లేదు. ప్రధాన కాంట్రాక్టు సంస్థ నుంచి ఉపకాంట్రాక్టు దక్కించుకున్న వారు వారి వద్ద నేర్చుకునే వారినే శిక్షకులుగా పంపిస్తున్నారు.

(Courtesy Eenadu)