( దేశీ దిశ పరిశోధన, విశ్లేషణ విభాగం)

పక్కింటి బాలికపై తాత వయసున్న వృద్ధుని అత్యాచారం.

ఏడాది బాలికపై యువకుని అఘాయిత్యం.

దేశంలో, తెలంగాణలో ఇలాంటి అమానుష ఘటనలు నిత్యం ఎక్కువైపోతున్నాయి. సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పసిపిల్లలపై అత్యాచారాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగటాన్ని గమనించిన సుప్రీంకోర్టు 100 posco కేసులు పెండింగులో ఉన్న ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని తాజాగా ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 18వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ రంగంలో పనిచేస్తున్న కార్యకర్తలు చెబుతున్నారు మొత్తం 33 జిల్లాలకు గాను.25 జిల్లాల్లో ప్రత్యేక పోస్కో కోర్టుల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 465, హైదరాబాద్ 300, నల్గొండ 200, కరీంనగర్ 170 కేసులతో రాష్ట్రంలో ముందున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణ కన్నా పోస్కో కేసులు తక్కువ నమోదయ్యాయి. ఆంధ్రాలో నాలుగు జిల్లాల్లో పోస్కో న్యాయస్థానాలు పెట్టాల్సి ఉంటుంది.

మనం ఇప్పుడు నయా ఉదారవాద, పెట్టుబడిదారి, వినియోగదారీ, మార్కెట్ సమాజంలో ఉన్నాం. ఈ సమాజం స్థానంలో వ్యక్తి స్వార్థాన్ని, మితిమీరిన పోటీతత్వాన్ని పెంచి  పోషిస్తున్నది. గతంలోని సంఘీభావం, సహనం, నిగ్రహం, సౌభాతృత్వం అనే మాటలకు ఇప్పుడు విలువ తగ్గిపోతున్నది. నేను నాది నా స్వార్థం నా సుఖం అనే భావనను సమాజము, టీవీ, సినిమాలు, సామాజిక మాధ్యమాలు ఇబ్బడిముబ్బడిగా విస్తున్నాయి.

ఆడపిల్లను ఆటవస్తువుగా వినియోగ వస్తువుగా కోర్కెలు తీర్చే మాంసపు ముద్దగా మన మాస్ మీడియా నేర్పుతున్నది. హైదరాబాదులో పబ్ కల్చర్ బాగా పెరిగింది. డ్రగ్స్ వ్యాపారంలో పెద్దలు సైతం ఉన్నారన్న కేసు ఆ మధ్య రాష్ట్రంలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత కేసు ఏ దశలో ఉన్నదో తెలియదు. జిల్లాల్లో గ్రామాలు ,పట్టణాల్లో సైతం మద్యం, డ్రగ్స్ అక్రమంగా ప్రవహిస్తున్నాయి అని మీడియా వార్తలు రుజువు చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వమే వ్యాపారాన్ని ముబ్బడిగా పెంచి వేస్తున్నది. తద్వారా భారీ ఎక్సైజ్ రాబడి పెంచుకుంటున్నది. ప్రస్తుతం ఏటా మద్యంపై మన రాష్ట్రంలో 19 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు అంచనా ఇవన్నీ కలగలిసి ఆడపిల్లలపై అత్యాచారాలను పెంచి పోషించేందుకు దోహదపడుతున్నాయి.

అందువల్ల  posco ప్రత్యేక కోర్టులు ఈ సమస్యను కొంతవరకే పరిష్కరించకలవు.

సత్వర న్యాయం, బాధితులకు పరిహారం పునరావాసం, తో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్, పోలీసింగ్, షీ టీమ్,ార్యాచరణ,యువతకు కౌన్సిలింగ్ అవసరం. మొత్తంగా విద్యా విధానం యువతకు సరైన విద్య సంస్కృతి, నేర్ప కలిగినప్పుడే ఈ దారుణాలు ఆగిపోతాయి. ఇందుకోసం మొత్తం సామాజిక మార్పు రావలసి ఉన్నది