భోపాల్‌: చత్తీస్‌ ఘడ్‌ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. సామూహిక అత్యాచారానికి గురైన రెండు నెలల క్రితం ఆత్మహ్యకు పాల్పడిన ఓ యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో మృతురాలి తండ్రి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు యువతి మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం..కొండాగాన్‌ గ్రామానికి చెందిన మతురాలు జులైలో బంధువుల వివాహ వేడుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను సమీపంలో ఉన్న అడవిలోకి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం మొత్తం ఏడుగురు నిందితులు మతురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఇంటికి వెళ్లిన బాధితురాలు ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు లేకపోవడంలో మతదేహాన్ని దహనం చేయకుండా గ్రామ శివారులో పూడ్చినట్లు బాధితురాలి బంధువు పేర్కొన్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, వారు పట్టించుకోలేదని తెలిపారు.కాగా తహశీల్దార్‌ సమక్షంలో శవపరీక్ష నిమిత్తం మతదేహాన్ని రెండు నెలల అనంతరం బుధవారం సమాధి నుంచి వెలికి తీసినట్లు బాస్టర్‌ ఎస్‌ఐ పి.సుందర్రాజ్‌ తెలిపారు. అనంతరం నిందితులపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశామని తెలిపారు.