హైదరాబాద్: హైదరాబాద్‌లోన ఓ మహిళపై అత్యాచారం జరిగిన సంగతి చాల ఆలసంగా వెలుగులోకి వచ్చింది. ఎవరూ లేని ఒంటరి మహిళపై కొంత మంది దుండగులు మూసి నది ఒడ్డున ఈ దారుణానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనతో బాధితురాలి ఆలస్యంగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
25 ఏళ్ల మహిళ గతంలో సికింద్రాబాద్‌లో వంటమనిషిగా పని చేసుకుంటూ జీవించేది. కరోనా విపత్తులో ఉపాధి లేకపోవడంతో పాతబస్తీలోని మూసీ నది పక్కనే ఉన్నగుళ్ళో ఉంటుంది. తన బట్టలు ఆరేస్తుండగా ఇదివరకే ఆమెను దృష్టిలో వుంచుకొని ముగ్గురు వ్యక్తిలు నిర్భందించి ఆమెపై బలవంతంగా పక్కకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు ఆ దుర్మార్గులు. ఈ క్రమంలో తను స్పృహ కోల్పోయి కోలుకుని వెంటనే ఆ మహిళా ఆఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.