ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 41 మంది విద్యార్థినులు ఒకే రోజు.. అది నూతన సంవత్సరం రోజు పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం జరిగింది. ఈ పాఠశాలలో 883 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ రోజు ఎవరెవరి పుట్టినరోజు అని ఉదయం విద్యార్థినులు లెక్కించుకోగా మొత్తం 41 మందిగా తేలింది. వసతి గృహ సంక్షేమాధికారి రోజనీలాకు విషయం తెలియగా ఆమె వారందరి చేత కేకు కోయించి పుట్టిన రోజు జరిపారు. విద్యార్థినులకు చిరు కానుకలు అందించారు.

Courtesy Eenadu