మర్పల్లిలో పలువురికి డెంగీ లక్షణాలు

వికారాబాద్‌, మర్పల్లి, సెప్టెంబరు 29: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డెంగీతో ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్‌ మండలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన శైలజ (21) వారం రోజులుగా డెంగీతో చికిత్స పొందుతూ.. ఆదివారం మృతి చెందింది. మర్పల్లి మండలం పిల్లిగుండ్ల గ్రామంలో తెలుగు అడివమ్మ (55), నర్సాపూర్‌ గ్రామంలో మహ్మద్‌ అష్రఫ్‌ (11) అనే ఐదో తరగతి విద్యార్థి డెంగీతో మృతి చెందారు. నర్సాపూర్‌ గ్రామానికి చెందిన షాబుద్దీన్‌, లక్ష్మీ, హష్కణ, నాగసాయి, విష్ణు, సమీర, మరో చిన్నారికి డెంగీ సోకిందని.. వారంతా సదాశివపేట, హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని గ్రామస్థులు తెలిపారు. అటు మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం అయ్యవారిపల్లికి చెందిన చిన్ని (1) ఆదివారం ఉదయం డెంగీతో మృతిచెందింది. హైదరాబాద్‌ శివారు జవహర్‌నగర్‌కు చెందిన కావ్య (5) అనే చిన్నారి తీవ్ర విషజ్వరంతో మృతి చెందింది.

Courtesy Andhrajyothi…