– రాష్ట్రపతి కార్యక్రమానికి అనుమతి తిరస్కరణ
– పుదుచ్చేరి వర్సిటీలో ఘటన

పాండిచ్చేరి: చదువులో తన ప్రతిభకు గోల్డ్‌ మెడల్‌ దక్కిన.. బుర్ఖా ధరించిందనే కారణంతో రాష్ట్రపతి కార్యక్రమానికి భద్రత సిబ్బంది అనుమతిని తిరస్కరించారు. ఈ ఘటన పుదుచ్చేరి యూనివర్సిటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే పాండిచేరి యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కళాశాలలో గతేడాది రబీమా అనే ముస్లిం విద్యార్థిని మాస్‌ కమ్యూనికేషన్స్‌ పీజీ పూర్తి చేసి.. గోల్డ్‌ మెడల్‌ సాధించింది. రాష్ట్రపతి చేతులు మీదుగా మెడల్‌ తీసుకోవడానికి కార్యక్రమానికి వచ్చింది. కానీ భద్రత సిబ్బంది.. బుర్ఖా ధరించిందని కారణంతో ఆమెను ఆడిటోరియంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఆమె ఎంత ప్రాధేయపడిన లోనికి అనుమతించలేదు. రాష్ట్రపతి వెళ్ళిన తరువాత, డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది మిగిలిన సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. తనను మతం ఆధారంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం సర్టిఫికేట్‌ మాత్రమే స్వీకరించి, బంగారు పతకాన్ని తిర్కరించింది.

(Courtesy nava telangana)