న్యూఢిల్లీ: ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మైనర్లపై లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధానిలోని చాణిక్యపురిలో ఉన్న విదేశీ రాయబార కార్యాలయంలో డ్రైవర్‌ గా పనిచేస్తున్న ఓ యువకుడు.. అక్కడే ఉంటున్న ఐదేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాయబార కార్యాలయంలో నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. అదే కార్యాలయంలో విధులు నిర్వహించే మరో ఉద్యోగి కుమార్తె అయిన ఐదేండ్ల ఓ బాలిక అక్కడి క్రీడా ప్రాంగణంలో ఆడుకుంటున్నది. నిందితుడు మాయమాటలు చేప్పి బాలికను తన ఇంట్లోకి తీసుకొచ్చి.. లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన బాలికను ఆమె తల్లి ఏయిమ్స్‌కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా.. లైంగికదాడి జరిగినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ విషయమై చిన్నారిని అడగ్గా జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

తొమ్మిదో తరగతి బాలికపై ఏడాది కాలంగా..
లైంగికదాడులకు పాల్పడటం, వాటిని చిత్రీకరించి బాధితులను బెదిరింపులకు గురిచేస్తూ.. లొంగదీసుకుంటున్న దారుణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘోరమే ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్నది. వారి ఇంటికి రంగు వేయడానికి వచ్చిన నయాబ్‌ (21), పర్వేజ్‌ (22)లు అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి.. నిందితుల ఇంటికి తీసుకుపోయి.. బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ దగ్గర ఉన్న మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలతో బాలికను లొంగదీసుకునీ, ఏడాది కాలంగా లైంగికదాడికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బాధితురాలు చెప్పినట్టు వినకపోవడంతో ఈ వీడియోలను నిందితులు సోషల్‌ మీడియాలో పెట్టారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్రలో ప్రాణాలతో పోరాడుతున్న దళిత మహిళ
ఔరంగబాద్‌ జిల్లాలోని అందారి గ్రామంలో ఒంటరిగా ఉంటున్న ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన సంతోష్‌ మోహితే అఘాయి త్యానికి ప్రయత్నించాడు. సదరు మహిళ దీనిని ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో.. నిందితుడు ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో బాధితురాలు కేకలు వేయ డంతో..అక్కడికి చేరిన స్థానికులు, తీవ్రంగా గాయ పడిన దళిత మహిళను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Courtesy Nava telagnana