నలుగురు చిన్నారుల మృతి
పంజాబ్‌లో దారుణ ఘటన

చండీగఢ్‌ : పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి పిల్లను ఇండ్లకు తీసుకువెళుతున్న వ్యానులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సజీవద హనమయ్యారు. ఘటన జరిగిన సమయంలో వ్యానులో 12 మంది విద్యార్థులున్నారు. సంగ్రూర్‌ జిల్లా లాంగోవాలా పట్టణంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన చిన్నారులంతా ఐదేండ్లలోపు వారేనని తెలుస్తున్నది. రోడ్డుపైనే వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సమీప పొలాల్లో పనిచేస్తున్న స్థానికులు వ్యాను దగ్గరకు పరుగులుపెట్టుకుంటూ వచ్చారు. పలువురు చిన్నారుల్ని బయటకు తీశారు. ఎనిమిది మంది విద్యార్థులను వారు కాపాడగలిగారు. అప్పటికే నలుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. కాలినగాయాలైన ఎనిమిది మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వ్యానులో మంటలు చెలరేగటానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంపై మెజిస్టేరియల్‌ దర్యాప్తుకు ఆదేశించారు. ఘటనాస్థలికి పోలీసు బృందాలను పంపించామనీ, కారణాలు తెలుసుకుంటున్నారని డిప్యుటీ కమిషనర్‌ ఘన్‌శ్యామ్‌ థోరి చెప్పారు.

Courtesy Nava Telangana