న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. వేల మంది మరణించారు. 190 పైచిలుకు దేశాల్లో ఈ మహమ్మారి విస్తరించింది. అయినప్పటికీ ఈ వైరస్‌ సోకని మారుమూల ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశాల్లో పలావు ద్వీపం కూడా ఒకటి. ఇది ఉత్తర పసిఫిక్‌లో ఉంది. ఇక్కడి జనాభా సుమారు 18,000. కానీ, ఇప్పటికీ ఒక్క కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కూడా పలావు ద్వీపంలో నమోదు కాలేదు. విస్తారమైన పసిఫిక్‌ మహాసముద్రంలో ఒక్క బిందువుగా కనిపించే ఈ ద్వీపానికి  సమీప పొరుగు ప్రాంతాలు కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే  ఉన్నాయి. వైరస్‌కు వ్యతిరేకంగా బఫర్‌గా ఈ ద్వీపం పనిచేసింది.  టోంగా, సోలమన్‌ దీవులు, మార్షల్‌ దీవులు, మైక్రోనేషియాతో సహా ఈ ప్రాంతంలోని అనేక దేశాలు తమకు కరోనా విస్తరించకుండా విధించుకున్న కఠినమైన ప్రయాణ ఆంక్షలు ఇందుకు సహాయపడ్డాయి.

Courtesy Andhrajyothi