రాష్ట్ర ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో 12% కేసుల పరిష్కారానికి పదేళ్లకు పైనే సమయం

న్యాయం ఎంత సత్వరం? సత్వర న్యాయం లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల్లోనూ అనేక కేసుల విచారణ పదేళ్లకు పైగా సాగిందంటే నమ్ముతారా? తాజాగా ‘దిశ’ కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దేశంలో వీటిపై చర్చ జరుగుతోంది.


ఈ కోర్టుల ద్వారా సత్వర న్యాయం అందిస్తున్న రాష్ట్రాల్లో జమ్ముకశ్మీర్‌, మధ్యప్రదేశ్‌ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. బిహార్‌, తెలంగాణ అట్టడుగున ఉన్నాయి.


న్యాయం ఎంత సత్వరం?

6 లక్షలు దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో ఈ ఏడాది మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న కేసులు.. వీటిలో అత్యధికం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నవే.


రాష్ట్ర ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల్లో దాదాపు 12% కేసుల్లో తీర్పులు వెలువడడానికి దాదాపు పదేళ్లకు పైగా సమయం పట్టిందని జాతీయ నేర గణాంకాల బ్యూరో 2017 నివేదిక చెబుతోంది. బిహార్‌లో అయితే ఈ కోర్టులకు అప్పగించిన వాటిలో మూడో వంతు వాటి పరిష్కారానికి పదేళ్లకు పైగా సమయం పట్టింది.

న్యాయం ఎంత సత్వరం?

 

న్యాయం ఎంత సత్వరం?

* దేశవ్యాప్తంగా ప్రస్తుతం 581 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఉన్నాయి. వీటిల్లోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది.

* లైంగిక వేధింపుల కేసుల సత్వర విచారణకు నిర్భయ నిధులతో దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

Courtesy Eenadu…