• రెండో స్థానంలో అధికార జేడీయూ.. 
  • ప్రభావం చూపని చిరాగ్‌ పాసవాన్‌
  • ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ వైపే మొగ్గు!
  • మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ నువ్వానేనా?
  • ఎగ్జిట్‌  పోల్స్‌ అంచనాలు
  • బిహార్‌ మూడో దశలో 55 శాతం పోలింగ్‌
  • ఈ నెల 10న ఫలితాల వెల్లడి

న్యూఢిల్లీ : బిహార్‌ ఎన్నికల్లో మహాకూటమి దుమ్ము రేపనుందా? మూడు పదుల వయసున్న తేజస్వీ యాదవ్‌ కూటమి తరఫున సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా? ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఔననే అంటున్నాయి. మహాకూటమిదే బిహార్‌ సర్కా రు అని ఉద్ఘాటిస్తున్నాయి. శనివారం మూడో దశ పోలింగ్‌ ముగియగానే పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదల చేశాయి. ఈ సర్వేలన్నీ ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీల మహాకూటమికే విజయావకాశాలు ఉంటాయని స్పష్టం చేశాయి.సీఎం అభ్యర్థిగా 44% మంది తేజస్వీ యాదవ్‌ వైపు మొగ్గుచూపినట్లు ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా సర్వేలో తేలింది. నితీశ్‌కుమార్‌ వైపు 35ు మంది మొగ్గుచూపారు. సీఎం అభ్యర్థిగా చిరాగ్‌పాసవాన్‌కు 7% మంది మాత్రమే మద్దతు ప్రకటించారు. మొత్తం 243 స్థానాలకు 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. మళ్లీ అధికారం కోసం జేడీయూ, బీజేపీ కూటమి తహతహలాడుతుండగా.. పాగా వేసేందుకు మహాకూటమి గట్టి పోరాటమే చేసింది. ఎన్నికలకు ముందే బీజేపీకి దూరమైన చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని లోక్‌ జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) ఒంటిరిగానే బరిలోకి దిగింది.

బిహార్‌లో మూడో దశలో 55% పోలింగ్‌
బిహార్‌లో శనివారం 78 స్థానాలకు జరిగిన మూడో దశ పోలింగ్‌లో 55.22% ఓట్లు పోలయ్యాయి. అయితే ఓట్ల శాతం పెరిగే అవకాశాలున్నట్టు డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ చంద్రభూషణ్‌కుమార్‌ చెప్పారు. ఫలితాలు ఈనెల 10న వెలువడతాయి.

ఇండియా టుడే- యాక్సిస్‌ మై ఇండియా:
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?
తేజస్వీ యాదవ్‌: 44%
నితీశ్‌ కుమార్‌ : 35%
చిరాగ్‌ పశ్వాన్‌: 7%
ఉపేంద్ర కుష్వాహా: 4%
సుశీల్‌ మోదీ: 3%

Courtesy Andhrajyoth