ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన  ఈ ఎన్నికల్లో మళ్లీ సామాన్యుడి (ఆమ్ ఆద్మీ) పార్టీయే ఢిల్లీ పీఠo దక్కించుకుంటుందని సర్వేలు తేల్చాయి. ఢిల్లీలో మొత్తం 70 స్థానాలకు ఎన్నికల్లో ఆప్, భాజపా హోరాహోరిగా తలపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ జాతీయ టీవీ చానళ్లు, సంస్థలు నిర్వహించిన సర్వేల్లో భాజపా, కాంగ్రెస్ కు ఆప్ చేతుల్లో భంగపాటు తప్పదని సర్వేలు సూచిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల కంటే ఎక్కువే గెలిచి ఆప్ మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి.ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..