2018లో 12,936 మంది బలవన్మరణం

న్యూఢిల్లీ, జనవరి 10: నిరుద్యోగ రక్కసి ప్రాణాలు తీస్తోంది. 2018లో దేశంలో 12,936 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి 40 నిమిషాలకు ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. అదే ఏడాది 10,349 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం 1,34,516 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో నిరుద్యోగులు 9.6 శాతం, రైతులు 7.7 శాతం ఉన్నారు. 2018లో ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 66 శాతం ఎంతో కొంత చదువుకున్న నిరుపేదలేనని నివేదిక పేర్కొంది.

రేప్‌ బాధితుల్లో నాలుగోవంతు మైనర్లే : దేశంలో 2018లో అత్యాచారానికి గురైన ప్రతి నలుగురిలో ఒకరు మైనరేనని జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించింది. 50 శాతానికి పైగా బాధితులు 18 నుంచి 30 ఏళ్లలోపు వారని తెలిపింది. 94 శాతం కేసుల్లో నేరస్థులు బాధితులకు తెలిసినవారే అయి ఉంటున్నారని పేర్కొంది.

Courtesy Prajashakthi