ప్రథమ స్థానంలో కొత్తూర్‌.. గ్రీన్‌పీస్‌ ఇండియా సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ : దేశంలో అత్యంత వాయు కాలుష్య నగరాలు, పట్టణాల జాబితాను గ్రీన్‌పీస్‌ ఇండియా సంస్థ మంగళవారం ప్రకటించింది. కేంద్రం నిర్దేశించిన జాతీయ పరిసరాల వాయు కాలుష్య ప్రమాణాల(ఎన్‌ఏఏక్యూఎస్‌) ప్రకారం.. కాలుష్య కారక నగరాలను గుర్తించామని ఆ సంస్థ పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 287 నగరాల్లో సర్వే నిర్వహించగా.. 231 నగరాల్లో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు తేలింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా జార్ఖండ్‌లోని ఝరియా ప్రథమ స్థానంలో నిలవగా.. తెలంగాణలోని 9 నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం అధికంగా ఉంది. నగర శివారులోని కొత్తూరు ప్రథమ స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌, రామగుండం, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆదిలాబాద్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

(Courtesy Andhrajyothi)