పట్టుగొమ్మ ఆయన సమాజానికి
నీడనిచ్చిన చెట్టుకొమ్మ
ఏమి సంపాదించుకున్నారు వారు

తినడానికి అన్నీ ఉన్నా పేదవాళ్ళతో
పస్తులు పడుకున్నారు ఆకలి
ఆస్తిగా పంచుకున్నారు
ఉద్యమమంటే త్యాగమని ఆయనను
చూశాకే నేర్చుకున్నారు నేటి యువతరం!

ఏమి సంపాదించుకున్నారు
బతుకంతా ఎదురీదిన బడబాగ్ని ఆయన
దళిత సమాజాన్ని దత్తత తీసుకున్న దళిత బాందవుడాయన !

ఉద్యమాల ఉపాద్యయుడు
సమాజానికి చదువు చెప్పిన
మహోపాద్యాయుడు
ఏమి సంపాదించుకన్నారు

జ్ఞానాన్ని పంచినారు
విజ్ఞానాన్ని పెంచిననారు
అరణ్యరోధన వద్దని సాటి మనుషులకు
మాట పంచి జీవపు ఊటైన వారు

సమాజానికి తన శ్వాసనిచ్చి
చివరి శ్వాసను విడిచారు
ఏమి సంపాదించుకున్నారంటే

కోట్లమంది జాతి జనుల
ప్రేమను సంపాదించుకున్నారు

– దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి