శాతవాహన యూనివర్సిటీ ప్రొ.సూరేపల్లి సుజాత గారిపై మతోన్మాద మూక సంఘాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిద్దాం…

పీడిత బహుజన ప్రజలు / యువత ముఖ్యంగా విద్యార్థులను ఏకం కాకుండా మతం మత్తులోకి దింపుతున్న మీ మతోన్మాద కులోన్మాద మనువాద సంఘాలను బ్యాన్ చెయ్యాలి… ఈ సమాజానికి పట్టిన పీడ విరగడ అవుతుంది…

యూనివర్సిటీకి చెడ్డ పేరు రాకుండా మీరు ఆరోపిస్తున్న నిరాధారమైన మావోయిస్టు కదలికలు ఉంటే, అందుకు ప్రోత్సహించే వారుంటే యూనివర్సిటీ మేనేజ్మెంట్ చర్య తీసుకుంటుంది…

యూనివర్సిటీ మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే పోలీసు వ్యవస్థ చూసుకుంటుంది… వారి పనే శాంతి భద్రతలను కాపాడటం… మీకేం పనిరా ప్రయివేట్ పోలీసుల్లారా ?  ABVP  అంటేనే అఖిల భారత్ వర్శిటీ పోలీసులని మీ మీద పడిన ముద్రను అలాగే  ఉంచుకుంటారో తుడిచేసుకుంటారో మీ ఇష్టం. మావోయిస్టు సంఘాలకు సహకరిస్తున్నట్టు ప్రొఫెసర్ సుజాత గారిపై ఆధారాలు లేకుండా నిందలు వేయడం సిగ్గు చేటు… అది ఆమెపై మీకున్న కక్షసాధింపు ఆలోచనను ప్రతిబింబింబిస్తుంది… మా తొడబుట్టువు తెరువొస్తే… తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. కాషాయ ముకల్లారా కబర్దార్ …

Kumaraswamy Kashapaka

మీ కాషాయ మనువాదుల అన్యాయాలను, అక్రమాలను, అరాచకాలను అధిపత్యాలను నిర్భయంగా నిలదీసే దళిత బహుజన ఆడబిడ్డ ప్రో. సుజాతను ముఖముఖి ఎదుర్కోలేక దొడ్డిదారిన దెబ్బతీయాలని లేనిపోని ఆరోపణలతో గుడ్డ కాల్చి ఆమె మీద వెయ్యాలని చూస్తే ఆ మంటే మిమ్మల్ని వెంటాడుతుందని హెచ్చరిస్తున్నాం. బహుజన ప్రతిఘటన శక్తే బహుజన పరిరక్షణ శక్తిగా మా స్త్రీ శక్తి సుజాతకి అండగా నిలుస్తుంది… కాషాయ ముకలరా ఖబర్దార్. పౌరహక్కుల నేతల అరెస్టు ఖండిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.

Usaa, Coordinator – Bahujan Resistance Forum

Bahujan Resistance Forum