కేంద్రాన్ని కోరనున్న రాష్ట్రం
అమరావతి:- 33,478 కోట్ల రూపాయలు..! ఇది తెలుగు రాష్ట్రాల మధ్య పంపకంకావాల్సిన అప్పు మొత్తం ఇది. సమైక్య రాష్ట్రం ఖాతాలో ఈ మొత్తం ఉండటంతో, విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్‌ పేరునే కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్ర ఖజానాకు అదనపు భారంగా మారుతోంది. దీంతో జాప్యం లేకుండా ఈ అప్పులను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తక్షణమే పంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాయనున్నట్లు సమాచారం. ఈ అప్పుల మొత్తాన్ని పంచాలని గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా కేంద్రానికి విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి వచ్చి, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తాజాగా మరోమారు లేఖ రాయాలని నిర్ణయించడం గమనార్హం. ఈ రుణాల పంపకాలు త్వరగా జరిగితే రాష్ట్రంపై వత్తిడి తగ్గుతురదని అధికారులు అరటున్నారు.

ఎఫ్‌ఆర్‌బిఎంపై ప్రభావం
2014 జూన్‌ రెరడో తేదీన రాష్ట్ర విభజన జరగ్గా, అరతకు మురదు వరకు 2,00,171 కోట్ల రూపాయల రుణ భారం ఉమ్మడి ఆరధ్రప్రదేశ్‌పై ఉరది. తరువాత కాలంలో కేంద్రం కొరత అప్పులను రెరడు రాష్ట్రాల మధ్య పంపకాలు చేసిరది. అయితే జనాభా ప్రాతిపదికన, పథకాల ప్రారతాల నేపథ్యంలో ఎక్కువ రాష్ట్రంపై అత్యధికంగా 97,177 కోట్ల రూపాయల భారం పడింది. అదికాక,ఉమ్మడి రాష్ట్రం పేరు మీదే ఇంకా, 33,478 కోట్ల రూపాయల రుణం కనిపిస్తోరది. దీనికి సంబంధిరచిన వడ్డీలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిరచాల్సి వస్తోరది. దీని ప్రభావం ఎఫ్‌ఆర్‌బిఎంపైనా పడుతోరదని రాష్ట్ర ప్రభుత్వం ఆరదోళన వ్యక్తం చేస్తోరది. 14వ ఆర్ధిక సంఘం ఖరారుచేసిన ఎఫ్‌ఆర్‌బిఎం నిబంధనల మేరకు జాతీయ స్థూల ఉత్పత్తిలో మూడు శాతం కన్నా తక్కువగా మాత్రమే రుణాలు కలిగి ఉరడాలి. ప్రస్తుత జిఎస్‌డిపి మేరకు రాష్ట్ర ప్రభుత్వం 25.16 శాతం కన్నా ఎక్కువ రుణర కలిగి ఉరడరాదు. అయితే పంపకాలు జరగని పాత రుణ భారం కారణంగా జిఎస్‌డిపిలో 28.18 శాతం రుణం ఉన్నట్లు కేంద్రర లెక్కిస్తోరదని, ఇది రాష్ట్రానికి నష్టం కలిగిరచేదిగా ఉరదని ఆర్ధికశాఖ చెబుతోరది. అరదుకే త్వరగా మిగులు రుణాన్ని రెరడు రాష్ట్రాలమధ్య పంపకాలు చేయాలని కేంద్రాన్ని కోరుతోరది.

Courtesy prajasakti..