ఎన్నికల్లో విజయం ఒక్కటే ముఖ్యం కాదు ఎన్నికల అనంతరం విజేతల్ని ప్రపంచం ఎలా చూస్తున్నది అనేది ముఖ్యమే. మన ఎన్నికల విధానాన్ని బ్రిటన్ నుంచి తీసుకున్నాం. పోటీచేసిన అభ్యర్థుల్లో ఓట్ల సంఖ్యలో అందరికన్నా పైనున్న వ్యక్తిని గెలిచినట్లు ప్రకటిస్తాం ఆ వ్యక్తికి సదరు నియోజకవర్గం లో మెజారిటీ ఓట్లు వచ్చి ఉండాల్సిన అవసరం లేదు బిజెపి దేశంలో పోలైన ఓట్లలో కేవలం 37 శాతం పొందింది. కానీ మెజారిటీ సీట్లు గెలుచుకున్నది ప్రతిపక్ష పార్టీలు మెజారిటీకి , భిన్నత్వానికి మధ్య తేడాను సక్రమంగా గుర్తించాయ. బిజెపి కి వచ్చింది మెజారిటీ గాని భారతీయ భిన్న సముదాయాల ఆదరణ కాదు. అధికారంలో ఉన్న బిజెపి శక్తిని గమనించిన ప్రతిపక్షాలు ఐక్య సంఘటనను రూపొందించి ఉండవలసింది. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ లతో ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ఒప్పందానికి వచ్చి ఉండవలసింది. ఆర్జెడి బెగుసరాయ్ లో కన్నయ్య కుమార్ కు మద్దతు నిరాకరించింది. జాతీయస్థాయి యువనేత కన్నయ్యకు అండగా నిలిస్తే లాలు వారసుడు తేజస్విని యాదవ్ కు అతను పోటీగా తయారవుతాడని ఆ పార్టీ భావన. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చే ఇటువంటి నిర్ణయాలు బిజెపికి మేలు చేశాయి. ప్రతిపక్షాలు నేడు ఇటువంటి ప్రశ్నలు వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి. మరొక ముఖ్యమైన అంశమేమిటంటే బిజెపికి వ్యతిరేకంగా చేసిన సంఘటనలు ఒక ప్రత్యామ్నాయ దార్శనికతను అందించలేకపోయాయి. మతతత్వ హిందూ, విద్వేష రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ భిన్నత్వాన్ని సమున్నతి కరిగించే దార్శనికతను తత్ అవసరాన్ని ప్రజల ముందు ఉంచలేక పోయాయి. ఇప్పటివరకు భారత దేశాన్ని ఐకమత్యం గా నిలుపుతున్నది గాంధీ నెహ్రూ ఠాగూర్ తదితర మహోన్నతులు ఈ దార్శనికతే అని వారు చెప్పలేక పోయారు. ఎప్పుడైనా ప్రత్యామ్నాయ సానుకూల దార్శనికతే ప్రజల్ని ఆకట్టుకుంటుంది. బిజెపి విద్వేష భావజాలానికి భిన్నమైన అటువంటి విజన్ ను ప్రతిపక్షాలు మన ముందుచిప్రజలని ఉత్తేజితులను చేయటంలో వైఫల్యం చందాయ్. 2019 ఎన్నికల్లో అధికారపక్షం ఎన్నికల సంఘం, దూరదర్శన్ ఇతర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి నిబంధనలకు విరుద్ధంగా తాయిలాలు పొందింది అన్న విమర్శలు కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నికలప్పుడు అన్ని పార్టీలను అధికార వ్యవస్థలు సమానంగా చూడాలి. పాలకపక్షం పట్ల విపక్ష చూపితే అది ఆటలో ఒక జట్టుకు కొమ్ము కాఛినట్లు అవుతుంది. ఇక డబ్బు ఇతర వనరులు వినియోగించటం లోనూ బిజెపి అన్ని పార్టీల కన్నా ఎంతో ముందున్నది. పోటీదారుల మధ్య ఉన్న ఇటువంటి తీవ్ర అసమానతల్ని తొలగించటానికి మనకు పటిష్టమైన చట్టాలు నిబంధనలు ముఖ్యంగా వాటి సక్రమ అమలు అవసరం. ఇటు వంటి ప్రమాణాల ఆధారంగా నే విజేతలకు విలువ ఉంటుంది. భారత ప్రజల్లో నైతిక నిబద్ధత సాహసాలకు కొదవేమీ లేదు. సాధారణ కాలంలోనూ , ఎన్నికల సమయాల్లోనూ అన్ని రకాల అంటే ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక ఆధిపత్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా వారు పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఏంటి పోరాటాలను చేసేవారిని అర్బన్ నక్సలైట్ల నో , దేశద్రోహుల నో పేర్లు పెట్టి నిర్బం దిస్తున్నది. కోర్టులు పలు సందర్భాలలో ప్రభుత్వ ఈ పోకడల్ని అడ్డుకున్నాయి కూడా. కానీ మన న్యాయవ్యవస్థ నత్త నడక కారణంగా బాధితులకు చాలామందికి సత్వర న్యాయం అందటం లేదు. హిందూ విద్వేష సిద్ధాంతాన్ని వ్యతిరేకినిచినందుకు పలువురు మేధావులు హత్యకు గురయ్యారు. ఇది చాలా అభ్యంతరకరం. పాలక పార్టీ ఇలాంటి పోకడల్ని కూడా దాని ఎన్నికల విజయంపై మచ్చను మిగులుస్తుంది. అందువల్ల విజేతలు తమను ప్రపంచం ఏ విధంగా గమనిస్తున్న దో , అంచనా వేస్తున్నది గమనంలోకి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలము ఎన్ని ఓట్లు వచ్చాయి అనే గణాంకాలు మాత్రమే కాదు.

రచన ప్రొఫెసర్ అమర్త్యసేన్  – రచయిత ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.

అనువాదం: బి. భాస్కర్, సీనియర్ జర్నలిస్టు..