Image result for పప్పర్‌ స్ర్పే"

  • ఆన్‌లైన్‌లో యువతుల ఆర్డర్‌.. ఆత్మరక్షణ కోర్సులపై ఆరా
  • రాష్ట్రంలో విద్యార్థినులకు కుంగ్‌ ఫూ, కరాటే, జూడోలో శిక్షణ

అది మాదాపూర్‌లోని ఒక ప్రముఖ రిటెయిల్‌ స్టోర్‌! తల్లిదండ్రులతో కలిసి ఆ షాపునకు సోమవారం రాత్రి ఓ విద్యార్థిని వచ్చింది. పెప్పర్‌ స్ర్పే ఉందా? అంటూ షాపు యజమానిని అడిగింది. లేదని యజమాని చెప్పడంతో అయితే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటాను అని చెప్పి ఆ విద్యార్థిని వెళ్లిపోయింది. దిశ హత్యోదంతం తర్వాత స్వీయ రక్షణ చర్యలకు మహిళలు మొగ్గుచూపుతున్నారనేదానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!

హైదరాబాద్‌, డిసెంబరు: దిశ ఘటన తర్వాత యువతులు తమ ఆత్మరక్షణ కోసం స్వీయ చర్యలు తీసుకుంటున్నారు. దిశ లాంటి పరిస్థితి తమకు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కొనేందుకు పెప్పర్‌ స్ర్పేను వాడటమే ఉత్తమమని అభిప్రాయపడుతున్నారు. కళాశాలకు, ఆఫీసుకు, ఇతరత్రా పనుల కోసం భయటకు వెళ్లేందుకు తమ వెంట పెప్పర్‌ స్ర్పేను తప్పనిసరిగా తీసుకెళ్తున్నారు. తమకు అందుబాటులో ఉన్న స్టోర్స్‌లో పెప్పర్‌ స్ర్పే కోసం సంప్రదిస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డరు చేస్తున్నారు. పెప్పర్‌ స్ర్పేనే కాకుండా నకుల్‌ డస్టర్‌, చిన్నపాటి కత్తులు కూడా తమ వెంట ఉంచుకుంటున్నారు. ఎలాంటి దాడి జరిగినా ప్రతిఘటించేలా ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు యువతులు, మహిళలు మరో అడుగు ముందుకు వేసి సెల్ఫ్‌ డిఫెన్స్‌ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

బాలికలకు’ఆత్మ రక్షణ’ శిక్షణ
దిశ హత్యాచార ఘటన నేపథ్యంలో విద్యార్థినులకు ఆత్మ రక్షణపై శిక్షణ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘జెండర్‌-ఈక్విటీ’ నినాదంతో తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 1,544 పాఠశాల (31 ప్రాథమికోన్నత, 1513 సెకండరీ)ల్లోని బాలికలకు కుంగ్‌ ఫూ, కరాటే, జూడోల్లో తర్ఫీదు ఇవ్వాలని డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఫిబ్రవరి వరకు వారానికి రెండుసార్లు గంటపాటు ఆత్మ రక్షణ తరగతులు నిర్వహించాలని నిర్దేశించింది.

మా జాగ్రత్తలో మేం ఉండాలి కదా? ఆపద సమయంలో పోలీసులు స్పందిస్తారనే నమ్మకం ఉంది. కానీ, మా జాగ్రత్తలో మేం ఉండాలి కదా?. మేం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో తెలియదు. అందుకే ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా పెప్పర్‌ స్ర్పేను వెంట ఉంచుకుంటున్నా. – ఉష, ప్రైవేటు ఉద్యోగి

(Courtesy Andhrajyothi)