దిల్లీ: ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దిల్లీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులైన నలుగురికి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. జనవరి 22 ఉదయం 7 గంటలకు దోషులను ఉరితీయాలని కోర్టు ఆదేశించింది.

నిర్భయ కేసులో దోషులకు మరణశిక్ష వెంటనే అమలు చేయాలని కోరుతూ బాధితురాలి తల్లి పాటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు విచారణ జరిపింది.