Image result for haryana dalit girl kidnap attempt"కిడ్నాప్‌నకు యత్నించి ముక్కు కోసేశారు

చండీగఢ్‌: హర్యానాలో ఓ దళితురాలిపై, ఆమె కుటుంబసభ్యులపై పెత్తందార్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. దళితబాలికను అపహరించాలన్న ప్రణాళిక విఫలమవ్వడంతో, ఆమె కుటుంబసభ్యులపై దాడిచేసి, బాధితురాలి ముక్కు కోసేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని చక్కర్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పూనమ్‌ కుమారి అనే దళితబాలిక ఇంట్లో ఉన్న సమయంలో, నిందితులు గౌరవ్‌ యాదవ్‌, ఆకాశ్‌ యాదవ్‌, సతీశ్‌ యాదవ్‌, మోను, లీలా యాదవ్‌లు వాళ్ల ఇంట్లోకి ప్రవేశించారు. బాధితురాలిని కిడ్నాప్‌ చేసేందుకు బయటకు లాక్కొచ్చారు. అక్కడే ఉన్న ఆమె కుటుంబసభ్యులు నిందితులను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన నిందితులు.. వాళ్లపై దాడి చేసి, వారి వద్దనున్న కత్తితో బాధితురాలి ముక్కు కోసేశారు. ఈ దారుణ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. దీనిపై బాధితురాలి సోదరుడు దివీన్‌ దయాల్‌ మాట్లాడుతూ.. గ్రామంలో వాళ్లే పెత్తనం చెలాయిస్తారని తెలిపారు. గ్రామస్తులతో తరచూ గొడవలకు దిగుతూ, వారిని బెదిరిస్తూ ఉంటారని వెల్లడించారు.

(Courtesy Nava Telangana)