ఆలయ ప్రవేశాన్ని నిరాకరించిన సిబ్బరది
భోపాల్‌: శాస్త్ర సాంకేతికత అభివృద్ధితో మానవుడు అంతరిక్షంలోకి కాలు పెడుతుంటే.. మరోవైపు కుల వివక్షతో ఓ దళిత పెండ్లి కొడుకును ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఈ అమానుష్య ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్లే.. బీరోడా గ్రామానికి చెందిన సందీప్‌ గవాలే అనే యువకుడు తన వివాహాన్ని ఆలయంలో చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం ముందస్తుగా జిల్లా కలెక్టర్‌ అనుమతి కూడా తీసుకున్నారు. వివాహా సమయానికి పెండ్లి కొడుకు తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్నారు. కానీ ఈ లోపు కొందరు దుండగులు ఆలయ ద్వారాలకు తాళం వేసి, లోనికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. ఆలయ ధర్మకర్తల ఆదేశాల మేరకే ఆలయానికి తాళం వేసినట్టు తెలిపారు. దీంతో బాధితులు వెంటనే కలెక్టర్‌ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఆలయ ధర్మకర్తలు, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Courtesy Navatelangana..