– గుజరాత్‌లో దారుణం

అహ్మదాబాద్‌: బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా రోజురోజుకూ దళితులు, మైనార్టీలపై పెత్తరదారీ వర్గాల ఆగడాలు తీవ్రమవుతున్నాయి. వారికి సహించని విషయాలపై ఆంక్షలు విధిస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మీసాలు పెంచాడని అక్కసుతో ఓ దళిత యువకుడిపై పెత్తరదారీ వర్గానికి చెందిన యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెV్‌ాసానా జిల్లా కొతసానా గ్రామానికి చెందిన సంజరు అనే దళిత యువకుడు మీసాలు పెంచాడు. మీసాలు మెలేసిన వీడియోలను టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేశాడు. ఆ వీడియోలను వీక్షించిన పెత్తందారీ కులానికి చెందిన యువకులు సంజరును గ్రామ శివారులోకి తీసుకెళ్లి మీసాలు తీసేయాలని ఆదేశించారు. వారి ఆదేశాన్ని బేకరాతు చేయడంతో..ఆగ్రహించిన పెత్తరదారీ యువకులు ఆ యువకుడిపై దాడి చేసి బలవంతంగా మీసాలను తొలగించారు. దీంతో సంజరు తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఆరుగురిని నిందితులుగా గుర్తించామనీ, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారనీ, త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ మనీష్‌ సింగ్‌ తెలిపాడు.

Courtesy Nava telangana… 

Tags- Dalit attacked,for growing mustoak, in Gujarat, voilence, law, discrimination