విశాఖ : హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి 11 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు సమాచారం. క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్రేన్‌ వద్ద 15 మందికిపైగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ భారీ క్రేన్‌ను ఇటీవల హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కొనుగోలు చేసింది. దీని నిర్వహణను ఇటీవలే పొరుగు సేవల సిబ్బందికి అప్పగించారు.

మంత్రి అవంతి ఆరా..
షిప్‌యార్డులో ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు.

Courtesy Eenadu