హైదరాబాద్‌: తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌కే తమ మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ పార్టీ ప్రకటించింది. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో సీపీఐ పోటీ చేయకపోవడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమకు మద్దతివ్వాలని సీపీఐని కోరాయి. కాగా, ఎవరికి మద్దతివ్వాలని పార్టీ తర్జనభర్జనలో పడింది. అయితే ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితికే తమ మద్దతు తెలపాలని సీపీఐ భావించింది. సమావేశం అనంతరం ఈ విషయాన్ని సీపీఐ వెల్లడింది. అయితే సమావేశంలో కొందరు దీనిని వ్యతిరేకించినప్పటికీ టీఆర్‌ఎస్‌కే మద్దతివ్వాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారని సమాచారం.

Courtesy Andhra Jyothy..