కరోనా వైరస్(కొవిడ్-19) భయంతో ప్రజలు వణికిపోతునారు. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పడు ప్రపంచంలోని అన్నిదేశాలు గడగడలాడిస్తోంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్రంతో పాటు  అన్ని రాష్ట్రాలు ముందుస్తు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కరోనా గురించి వాస్తవాలతో పాటు వదంతులు విపరీతంగా ప్రచారంలోకి వస్తున్నాయి. అసలు కరోనా ఎలా వ్యాపిస్తుంది అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కరోనా వైరస్ చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాపిస్తుంది. చైనాలోని వూహాన్‌లో వెలుగు చూసిన ఈ వైరస్ అక్కడ పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో తొందరగా విస్తరించింది. కరోనా సోకిన వారికి దగ్గర ఉన్నవారి ద్వారా ప్రపంచ దేశాలకు పాకింది. అంటార్కికా మినహా అన్ని ఖండాలకు వ్యాపించింది.

మన దేశంలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వైరస్ వ్యాప్తికి అవకాశాలు తక్కువ. విదేశాలకు వెళ్లి.. అక్కడి బాధితులతో కలిసి పనిచేయడం, కలిసి ప్రయాణించడం, కలిసి ఉన్నవారి ద్వారా ఈ వైరస్‌ మన దేశానికి వచ్చినట్టు తెలుస్తోంది.

కరోనా వైరస్‌ బయటి వాతావరణంలో 12 గంటలకు మించి బతకలేదు.  బాధితుడి నుంచి బయటికి వచ్చిన కరోనా వైరస్‌ రెండు మీటర్ల దూరానికి మించి ప్రయాణించలేదు.  

గాలి ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. బాధితులకు దగ్గర ఉన్న వారందరూ వైరస్ బారిన పడకపోవచ్చు.

రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలతో పాటు దీర్ఘకాలిక జబ్బులు (మధుమేహం, బీపీ, కిడ్నీ, కాలేయ, క్యాన్సర్‌ సంబంధ వ్యాధులు)లతో బాధపడుతున్న రోగులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  

కరోనా వైరస్ సోకిన బాధితులతో ఉన్నవారిలో 81 శాతం మందికి ఇది సోకే అవకాశం లేదు. 14 శాతం మందికి మాత్రమే వైద్య పరీక్షలు, హోమ్‌ ఐసోలేషన్‌ అవసరం. 5 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సపోర్టు చికిత్సలు చేయాల్సి రావచ్చు.

స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనా వైరస్ మరణాల శాతం తక్కువని గణాంకాలు చెబుతున్నాయి. స్వైన్‌ప్లూ బాధితుల్లో మరణాల శాతం 6 నుంచి 7 శాతం ఉంటే కరోనాలో 3 శాతమేనని తేలింది.   

వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, ముఖానికి మాస్క్ లు ధరించడం ద్వారా కరోనా వైరస్ నుంచి కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు సలహాయిస్తున్నారు.