లండన్‌ : కరోనా రోగుల ప్రాణాలు నిలిపే ఓ ఔషధాన్ని తొలిసారిగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్తమా చికిత్సకు వాడే స్ట్టీరాయిడ్‌ ‘డెక్సామెథసోన్‌’తో కరోనా మరణాలను మూడింట ఒకవంతుకు తగ్గించవచ్చని వారి అధ్యయనంలో తేలిం ది. రికవరీ(ర్యాండమైజ్డ్‌ ఎవాల్యుయేషన్‌ ఆఫ్‌ కొవిడ్‌-19 థెరపీ) పేరిట 2,104 మందిపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఈవిషయం వెల్లడైంది. ఆ రోగులకు రోజూ 6 మిల్లీగ్రాముల చొప్పున పది రో జులు డెక్సామెథసోన్‌ను ఇంజెక్షన్‌ లేదా మాత్ర రూ పంలో అందించారు. ఇదే సమయంలో మరో 4వేల మంది వలంటీర్లకు ఈ స్ట్టీరాయిడ్‌ను ఇవ్వలేదు. ఈ రెండు గ్రూపులలోని కొవిడ్‌ రోగుల ఆరోగ్యాల్లో వచ్చిన మార్పులను నమోదు చేసి విశ్లేషించగా డెక్సామెథసోన్‌ ప్రభావవంతంగా పనిచేస్తోందని తేలింది.

వెంటిలేటర్‌పై ఉన్న రోగులు ఈ ఔషధాన్ని వాడగా మరణాల ముప్పు 40 నుంచి 28 శాతానికి తగ్గగా, ఆక్సిజన్‌ అవసరమైన రోగులకు మరణ గండం 25 నుంచి 20ు మేర తగ్గినట్లు గుర్తించా రు. ప్రపంచవ్యాప్తంగా దీని లభ్యత ఎక్కువగా ఉం డటం, ధర చాలా తక్కువగా ఉండటం సానుకూల అంశాలని లీడ్‌ రిసెర్చర్‌ మార్టిన్‌ లాండ్రే తెలిపారు.

Courtesy Andhrajyothi