ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ కరోనా రోజు రోజుకి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నది. అమెరికా, యూరప్ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కోవిడ్ మృతులు చాలా తక్కువ. వాస్తవానికి వివిధ దేశాల మధ్య కూడా వైరస్ తీవ్రత, వ్యాప్తిలో తేడాలున్నాయి. అందుకు ఆయా ప్రాంతాల వాతావరణాలు, ఆహారపుటలవాట్లు వంటివి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మనదేశంలో విస్తృతంగా బీసీజీ వ్యాక్సినేషన్, జనాభాలో యువత అత్యధిక శాతం ఉండటంవల్ల మృతుల సంఖ్య చాలా తక్కువ అని అభిప్రాయ పడుతున్నారు.

రోజూ నువ్వులు తీసుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వారు చెప్పిన ప్రకారం కోవిడ్ వైరస్ శరీరంలోకి ప్రవేశించి గ్లైసిన్ లాగేసుకుంటుంది. మానవ శరీరంలోని వ్యవస్థలు ఉత్తమంగా పనిచేయటానికి గ్లైసిన్ ఎంతో అవసరం. శరీరంలో వైరస్ చేసే విధ్వంసాన్ని అడ్డుకునేందుకు మూడు రెట్లు అదనంగా గ్లైసిన్ ను పూరించాలి. ఆ పని నువ్వులు చేస్తుంది.

ప్రతిరోజు రెండుసార్లు నువ్వులు యాభై గ్రాముల చొప్పున తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. కారంతో కలిపి దీన్ని తినవచ్చు. ఇంకా ఫోర్క్ స్కిన్, ఆవాలు ఆవనూనె, నువ్వుల నూనె వాడటం మంచిది. నలభై దాటిన తర్వాత శరీరానికి గ్లైసిన్ అవసరం ఎక్కువ. ప్రస్తుత కరోనా నేపథ్యంలో భారతీయుల ఆహార దినుసు అయిన నువ్వులు మన రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.