న్యూఢిల్లీ: కరోనా ప్రపంచవ్యాప్తంగా కాటేస్తోంది. లక్షల ప్రాణాలను బలితీసుకుంది. కరోన కట్టడికి కోసం ఎన్నో ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు, ౩వ దశలో క్లినికల్ ట్రైల్స్ వేంగంగా జరగడం, ఆ ప్రయోగాలపై ఆశాజనికమైన ఫలితలను కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరో శుభవార్త వినిపిస్తోంది. ముంబైకి చెందిన స్టార్టప్ కంపెని థర్మ్‌సెన్స్ రూపొందించిన ఫేస్ మాస్క్ నోరు, ముక్కు ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా, వైరస్‌ను కూడా చంపే విధంగా నానోటెక్నాలజీని ఉపయోగించి కరోనా వైరస్ మాస్కుల తయారీ చేసింది. ఈ మాస్క్‌ను 60 నుంచి 150 సార్లు వరకూ ఉపయోగించుకోవచ్చని, ఈ మాస్క్ కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడడంతో పాటు, మాస్క్ బయటి పొరకు వైరస్ అంటుకునేలా చేసి, దానిని చంపేసే విధంగా తయారుచేశారు. ఈ మాస్క్ భారత్, అమెరికన్ ప్రయోగశాలలో నుంచి కూడా ఆమోదం పొందింనట్లు సమాచారం. అదేవిధంగా ఈ మాస్క్‌కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫైడ్ చేసిదని తెలుస్తోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ మాస్క్ వేల రూ. 300 నుంచి 500 రూపాయల మధ్య ఉండవచ్చని భావించవచ్చు.