• దేశంలో వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
  • ధరలో అధిక భాగం పన్ను భారమే
  • కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ
  • విపణిలో తగ్గిన ముడి చమురు ధర
  • ఆ లాభం ప్రజలకు దక్కకుండా
  • ఎక్సైజ్‌ డ్యూటీ పెంచిన మోదీ సర్కార్‌
  • అంతర్జాతీయ విపణిలో మళ్లీ పైపైకి ముడిచమురు
  • సెప్టెంబరు నెలాఖరుకు లీటర్‌ పెట్రోలు రూ.85!

2 లక్షల కోట్లు
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గితే మనకు కూడా పెట్రో ధరలు తగ్గాలి. వినియోగ దారులకు ఆ లాభం అంద కుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుకుంటూ పోతోంది. మార్చి 14న లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. గత నెల పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 మేర సుంకాన్ని పెంచింది. దీంతో కేంద్రానికి 2 లక్షల కోట్ల అదనపు ఆదాయం లభించనుంది.

హైదరాబాద్‌ సిటీ : వరుసగా ఐదో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి.. డైనమిక్‌ ప్రైసింగ్‌ (అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ధరల సవరణ) విధానాన్ని నిలిపివేసిన చమురు సంస్థలు ఆదివారం నుంచి మళ్లీ బాదుడు షురూ చేశాయి. హైదరాబాద్‌లో పెట్రోలు ధర గత నాలుగు రోజుల్లో రూ.2.85 పైసల మేర పెరిగింది. ఇది ఇలాగే కొనసాగి.. మరో వారంలో రెండింటి ధరలూ 5-6 రూపాయల మేర పెరిగే అవకాశం ఉందని  ఆలిండియా పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అజయ్‌ బన్సల్‌ తెలిపారు. సెప్టెంబరు నెలాఖరుకు పెట్రో ధరలు రూ.85కు కూడా చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన నేపథ్యంలో ఇంధన వాడకం పెరుగుతుండడమే ఇందుకు కారణం. మరీ జనతా కర్ఫ్యూ ముందున్నస్థాయిలో కాకపోయినా.. దేశవ్యాప్తంగా వాహనాల రాకపోకలు గణనీయంగానే పెరిగాయి. మిగతా దేశాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అనేక దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు కావడంతో చమురు గిరాకీ ఒకదశలో మట్టానికి పడిపోయింది.

అమెరికాలోని వెస్ట్‌ టెక్సస్‌ ఇంటర్మీడియెట్‌ చమురు ధరలు మరీ దారుణంగా మైనస్‌ 37.63 డాలర్లకు (అంటే నెగెటివ్‌ ధర), బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఏప్రిల్‌ 21 నాటికి 20 డాలర్ల దిగువకు పడిపోయాయి. ప్రపంచం మొత్తానికీ ఆయిల్‌ ధరలకు బెంచ్‌ మార్క్‌ బ్రెంట్‌ ముడిచమురు అయితే.. అమెరికన్లకు బెంచ్‌మార్కు ‘వెస్ట్‌ టెక్సస్‌ ఇంటర్మీడియెట్‌. కాగా, డైనమిక్‌ ప్రైసింగ్‌ ప్రకారం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గితే మనకు కూడా తగ్గాలి. కానీ, వినియోగదారులకు ఆ లాభం అందకుండా కేంద్రం ఎప్పటికప్పుడు పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని పెంచుకుంటూ పోతోంది. ఈక్రమంలోనే ఈ ఏడాది మార్చి 14న లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ పెంచిం ది. లాక్‌డౌన్‌ దెబ్బకు చమురు అమ్మకాలు పడిపోవడంతో.. ఆదాయాన్ని పెంచుకునేందుకు మళ్లీ మే మొదటివారంలో పెట్రోలుపై రూ.10, డీజిల్‌పై రూ.13 మేర సుంకా న్ని పెంచింది. ఈ పెంపు ద్వారా కేంద్రానికి అదనంగా సమకూరే ఆదాయం రూ.2 లక్షల కోట్లని అంచనా. 2014లొ మోదీ అధికారంలోకి వచ్చేసమయానికి పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.9.48గా, డీజిల్‌పై రూ.3.56గా ఉండేది. తర్వాత మోదీ సర్కారు పదేపదే పెంచడంతో ప్రస్తుతం పెట్రోలుపై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.32.98కి, డీజిల్‌పై రూ.31.83 కు చేరింది. దీనికి రాష్ట్రాల పన్నులు అదనం. ఒక ఉదాహరణ చూద్దాం. గత నెల 6న ఎక్సైజ్‌ డ్యూటీ పెంపుతో ఢిల్లీలో పెట్రోలు ధర రూ.71.26 అయింది. అందులో పెట్రోలు అసలు ధరెంతో తెలుసా? కేవలం రూ.18.28 మాత్రమే. ఎక్సైజ్‌ డ్యూటీ(రూ.32.98), డీలర్‌ కమీషన్‌ (రూ.3.56), వ్యాట్‌(ఇది రాష్ట్రం విధించేది- రూ.16.44) కలిపితే మొత్తం రూ.71.26. ఈ లెక్కన ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌పై ఏస్థాయిలో ప్రజలను బాదుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. డైనమిక్‌ ప్రైసిం గ్‌ విధానాన్ని నిజాయతీగా అమలు చేసి అంతర్జాతీ య విపణిలో ముడిచమురు ధర తగ్గినప్పుడల్లా ఆ లాభాన్ని ప్రజలకు బదలాయిస్తే.. పెట్రో ధరలు కనీసం ఇప్పుడున్న ధరల కన్నా రూ.30 దాకా తక్కువ ఉంటాయని అజయ్‌ బన్స ల్‌ పేర్కొన్నారు. కేంద్రమే కాదు.. 15 రాష్ట్రాలు లాక్‌డౌన్‌ సమయంలో తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి.. పెట్రోలుపై విలువ ఆధారిత పన్నును పెంచాయి.

సిలిండర్ల ధరలూ పైపైకే!
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వంటగ్యాస్‌ సిలిండర్ల ధరలూ పెరగనున్నాయి. ఈ ఏడాదిలో సిలిండర్ల ధరలు జూన్‌ 1న రూ.11.50 మేర (ఢిల్లీలో) పెరిగా యి. మున్ముందు గ్యాస్‌ ధరలు ఇంకా పెరగనున్నాయని ఆర్థిక నిపుణుల అంచనా. లాక్‌డౌన్లతో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం తగ్గి ధరలు పడిపోవడంతో.. ఏప్రిల్‌ 1 నాటికి మనదేశం బ్యారెల్‌ చమురును సగటున 1491.57కు దిగుమతి చేసుకుం ది. ఇప్పుడు మళ్లీ ధరలు పెరిగి 2516.77కు చేరింది. ఈ భారమంతా వినియోగదారులపై పడనుంది.

Courtesy Andhrajyothi