మంచిర్యాల: బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 2 నుంచి దేశవ్యాప్తంగా బొగ్గు సంస్థల్లో సమ్మె చేయనున్నట్లు భారతీయ మజ్‌దూర్‌ సంఘ్‌(బీఎంస్‌) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ బీకే రాయ్‌ ప్రకటించారు. ఈ నెల 18న 50 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. బీఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ సంస్థలకు చెందిన జాతీయ నాయకులు ఆదివారం ఆన్‌లైన్‌లో సమావేశమై సమ్మె నిర్ణయం తీసుకున్నామని రాయ్‌ తెలిపారు. ఈ నెల 18న జరిగే బొగ్గు గనుల ప్రైవేటీకరణ, వేలాన్ని నిలిపివేయాలన్నారు. కోల్‌ ఇండియా, దాని అనుబంధ బొగ్గు సంస్థల్లో, సింగరేణిలో ఈ సమ్మె ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Courtesy Andhrajyothy