ప్రొఫెసర్ శేషయ్య గారు ఇప్పుడే తీవ్ర అనారోగ్యంతో AIG ఆసుపత్రి, హైదరాబాద్ లో మరణించాడు ..

ప్రొఫెసర్ శేషయ్య గారు,కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ పౌర హక్కుల సంఘం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్, కోవిడ్ తో అనారోగ్యానికి గురై 24 సెప్టెంబర్,2020 నుండి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స తీసుకుని,ఆరోగ్యం మెరుగు కానందున అక్కడి డాక్టర్ల సలహా మేరకు, శనివారం రాత్రి (ఆదివారం,4-10-2గ0020) సుమారు1:00గంటల సమయంలో అనంతపురం ఆసుపత్రి నుండి, హైదరాబాద్, గచ్చిబౌలి లోని AIG ,ఆసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గాస్ట్రోఏంట్రాలజి(Asian Institute of Gastroentrology)లో అడ్మిట్ అయినారు.అప్పటి నుండి ప్రొఫెసర్ శేషయ్య గారు వెంటిలేటర్ పైనే ఉన్నారు.సార్ పరిస్థితి ఈరోజు వరకు ఇంకా విషమంగానే ఉండి, ఇప్పుడే రాత్రి 8.30 మరణించి నాడు.ఆయనకు పౌర హక్కుల సంఘం జోహార్లు అర్పిస్తూ,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతుంది.

N.నారాయణరావు, ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
చిలుకా చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్..

పౌరహక్కుల నేత శేషయ్య మృతి
  • ఆ సంఘానికి వివిధ హోదాల్లో సేవలు

హైదరాబాద్‌ సిటీ : పౌరహక్కుల సంఘం తెలుగు రాష్ట్రాల కో-ఆర్డినేషన్‌ కమిటీ జాతీయ కన్వీనర్‌ ఆచార్య శేషయ్య(64) ఇకలేరు. కరోనా బారిన పడి కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. శేషయ్యకు భార్య శశికళ, కుమారుడు అరుణ్‌ ఉన్నారు. శేషయ్య స్వస్థలం కర్నూలు జిల్లా. వృత్తిరీత్యా అనంతపురంలో స్థిరపడ్డారు. ర్యాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ తొలి ఉపాధ్యక్షుడిగా విద్యార్థి రాజకీయాల్లోనూ ముఖ్య భూమిక పోషించారు. ఎస్కేయూ డీన్‌గానూ సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, అధ్యక్ష హోదాల్లో విశిష్ట సేవలందించారు.

సమస్యలపై ఎలుగెత్తిన పోరాట నేత
రాయలసీమ ఫ్యాక్షన్‌తో పాటు నీరు, దళిత, ఆదివాసీ, మైనార్టీ, మహిళల సమస్యలపై ఎలుగెత్తిన పోరాట నేతగా పేరుగాంచారు. ప్రజాపోరాట సంఘాల ఐక్యవేదికకు ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ఎన్‌కౌంటర్‌ మరణాలపై పలు నిజనిర్ధారణ కమిటీల్లోనూ కీలకంగా వ్యవహరించారు. ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి జై కొట్టారు. ఆదివారం అంబర్‌పేట్‌ శ్మశానవాటికలో శేషయ్య అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శేషయ్య మృతికి తెలంగాణ ప్రజాఫ్రంట్‌, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం సంస్థలు సంతాపం తెలిపాయి.